Asianet News TeluguAsianet News Telugu

ఫ్లైట్ అటెండెంట్ పై దాడి... ప్రయాణికుడి అరెస్ట్...!

ఆ సమయంలో అతను విమానంలోని అటెండెంట్ పై దాడి చేశాడు. దీనంతటినీ  విమానంలోని మరో ప్రయాణికుడు వీడియో తీయగా... అది కాస్త వైరల్ గా మారింది.

American Airlines Passenger Punches Flight Attendant After Argument
Author
First Published Sep 23, 2022, 3:49 PM IST

విమానంలో ఫ్లైట్ అటెండెంట్ పై దాడి చేసిన కారణంగా ఓ ప్రయాణికుడిని ఎయిర్ లైన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా.. అతను మరోసారి తమ ఎయిర్ లైన్స్ లో ప్రయాణం చేయకుండా అతనిపై జీవిత కాలం నిషేధం విధించారు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బుధవారం అమెరికన్ ఎయిర్ లైన్స్ లో ఒక అమెరికన్ మెక్సికోలోని లాస్ కాబోస్ నుంచి లాస్ ఎంజెల్స్ కి వెళుతున్నాడు ఆ సమయంలో అతను విమానంలోని అటెండెంట్ పై దాడి చేశాడు. దీనంతటినీ  విమానంలోని మరో ప్రయాణికుడు వీడియో తీయగా... అది కాస్త వైరల్ గా మారింది.

 విమానం లాస్ ఏంజెల్స్ లో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో  ల్యాండ్ అయ్యింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు వెంటనే ప్రయాణీకుడిని అరెస్టు చేశారు. అతనిపై జీవిత కాలం నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు.

సదరు ప్రయాణికుడు.. విమానంలో ఫుడ్ అందజేస్తున్న వ్యక్తికి కాఫీ ఆర్డర్ చేశాడు. అనంతరం ఫస్ట్ క్లాస్ క్యాబిన్ కి వెళ్లి కూర్చున్నాడు. అతి అతని సీటు కాకపోయినా అక్కడ కూర్చోవడం గమనార్హం. దీంతో... ఆ సీటు ఖాళీ చేయాలని చెప్పినందుకు... అటెండెంట్ పై దాడి చేయడానికి దిగడం గమనార్హం.

 


అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేసింది, "మా జట్టు సభ్యులపై హింసాత్మక చర్యలను అమెరికన్ ఎయిర్‌లైన్స్ సహించదు. ఈ సంఘటనలో పాల్గొన్న వ్యక్తి భవిష్యత్తులో మాతో ప్రయాణించడానికి ఎప్పటికీ అనుమతించము’ అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.
 

Follow Us:
Download App:
  • android
  • ios