Asianet News TeluguAsianet News Telugu

Boat Missing: మాన‌వ అక్ర‌మ ర‌వాణా.. అమెరికాలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం.. 39 మంది గ‌ల్లంతు !

Boat Missing: అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 40 మందిని తీసుకెళ్తున్న ఓ ప‌డ‌వ ప్ర‌మాద‌వ‌శాత్తు నీట‌మునిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక్క‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా, 39 మంది అచూకీ ల‌భించ‌లేదు. అమెరికా తీర ప్రాంత భ‌ద్ర‌తా అధికారులు గ‌ల్లంతు అయిన వారి కోసం వెతుకుతున్నారు. మాన‌వ అక్ర‌మ ర‌వాణా చేస్తున్న క్ర‌మంలోనే ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 
 

America Teams search through night for 39 missing from capsized boat off Florida
Author
Hyderabad, First Published Jan 27, 2022, 9:39 AM IST

Boat Missing: అగ్ర‌రాజ్యం అమెరికా(America)లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడా(Florida) తీరంలో 40 మందిని తీసుకెళ్తున్న ఓ ప‌డ‌వ ప్ర‌మాద‌వ‌శాత్తు నీట‌మునిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక్క‌రు  మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా, 39 మంది అచూకీ ల‌భించ‌లేదు. అమెరికా తీర ప్రాంత భ‌ద్ర‌తా అధికారులు గ‌ల్లంతు అయిన వారి కోసం వెతుకుతున్నారు. మాన‌వ అక్ర‌మ ర‌వాణా చేస్తున్న క్ర‌మంలోనే ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప‌డ‌వ ప్ర‌మాదంపై అమెరికా అధికారులు మాట్లాడుతూ.. ఫ్లోరిడాలోని అట్లాంటిక్‌లో మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి ఈ ప‌డ‌వ ప్ర‌మాదం చోటుచేసుకుంది. అందులో  40 మంది ఉండ‌గా, వారిలో ఒక‌రు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం గురించి పోలీసుల‌కు ఆ వ్య‌క్తి ద్వార‌నే స‌మాచారం అందింద‌ని తెలిపారు. మియామీకి తూర్పున 50 మైళ్ల (80 కిమీ) దూరంలో ఉన్న బహామాస్ బిమిని దీవుల నుండి 40 మంది వ్యక్తులతో శనివారం రాత్రి పడవలో బయలుదేరినట్లు ప్రాణాలతో బయటపడిన వ్యక్తి అధికారులకు తెలిపినట్లు కోస్ట్ గార్డ్ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రాణాలతో బయటపడిన వ్య‌క్తి మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం, ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరంలోని ఫోర్ట్ పియర్స్ ఇన్‌లెట్‌కు తూర్పున 45 మైళ్ల (72.4 కి.మీ) దూరంలో మయామి, కేప్ కెనావెరల్ మధ్యలో  ఉన్న మార్గమధ్యంలో ప్ర‌తికూల వాతావరణ ప్ర‌భావం కార‌ణంగా ప‌డ‌వ ప్ర‌మాదానికి గురై బోల్తా ప‌డింది. ఈ స‌మ‌యంలో అందులో ప్ర‌యాణిస్తున్న వారు ఎవ‌రూ కూడా లైఫ్ గార్డ్ ధ‌రించ‌లేద‌ని తెలిపారు.  గంటకు 23 మైళ్లు (37 కిమీ), 9 అడుగుల (3 మీటర్లు) సముద్ర అల‌ల‌ వేగంతో స్థిరమైన గాలులు వీచడంతో, ఆ ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తీర‌ప్రాంత స‌రిహ‌ద్దు అధికారులు తెలిపారు. అయితే, ప‌డ‌వ‌కు మున‌కు సంబంధించిన ప‌లు వ‌స్తువులు నీటిపై తేల‌డం, ఓ వ్య‌క్తి వాటిని ప‌ట్టుకుని ఉన్న‌ట్టు గుర్తించిన అధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై అత‌డిని కాపాడారు. అయితే, త‌న‌తో పాటు మ‌రో 39 మంది ఉన్న‌ట్టు చెప్ప‌డంతో బాధితుల‌ను వెత‌క‌డానికి రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. ఈ ప‌డ‌వ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన వ్య‌క్తికి గాయాలు కావ‌డంతో పాటు డీ హైడ్రేష‌న్ కు గుర‌య్యాడ‌నీ, ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడ‌ని తెలిపారు. అత‌ని ఆరోగ్య ప‌ర‌స్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని అధికారులు తెలిపారు. 

ఇప్ప‌టికీ త‌ప్పిపోయిన వారి కోసం అధికారులు గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు. అయితే, ప్లోరిడా సముద్ర తీరం స్మగ్లర్లకు, మనవ అక్రమ రవాణా కేంద్రంగా మారిందని కోస్ట్ గార్డ్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప‌డ‌వ ప్ర‌మాదం ఇదే త‌ర‌హాకు సంబంధించింద‌నే అనుమానాలు వ్య‌క్తం చేశారు.  ఓడలో ఉన్నవారి జాతీయతలను ఇంకా గుర్తించాల్సి ఉందని కోస్ట్ గార్డ్ ప్రతినిధి పీటీ ఆఫీసర్ జోస్ హెర్నాండెజ్ తెలిపారు. కాగా, గత శుక్రవారం బిమినికి పశ్చిమాన కూడా ఓ ప‌డ‌వ ప్ర‌మాదం చోటుచేసుకుంది. వ‌ల‌స‌దారుల‌తో వెళ్తున్న ఈ ప‌డ‌వ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో దాదాపు 32 మందిని అధికారులు కాపాడారు. అయితే, డ‌జ‌న్ల మంది అచూకీ ల‌భించ‌లేదని హెర్నాండెజ్ తెలిపారు. అలాగే, మే 2021లో ఫ్లోరిడాలోని కీ వెస్ట్‌లో పడవ ప్ర‌మాదంలో చ‌నిపోయిన 12 మంది క్యూబా వలసదారుల శ‌వాలు ఒడ్దుకు కొట్టుకు వ‌చ్చాయి. ఎనిమిది మందిని అధికారులు కాపాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios