Asianet News TeluguAsianet News Telugu

అమెరికా వల్లనే యుద్ధ వాతావరణం.. ఆయుధ సంపత్తి పెంచుకుంటాం: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

ఉత్తర కొరియా మరోసారి అగ్రరాజ్యం అమెరికాపై మండిపడింది. అమెరికా వల్లనే కొరియా ద్వీపకల్పంలో అస్థిరతలు ఏర్పడ్డాయని, యుద్ధ వాతావరణం నెలకొందని ఆగ్రహించింది. దేశ సమగ్రతను కాపాడుకోవడానికి, యుద్ధాన్ని నిలువరించడానికి తప్పకుండా ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు.
 

america sole reason for tensions says north korea president kim jong un
Author
New Delhi, First Published Oct 12, 2021, 12:45 PM IST

సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అమెరికాపై నిప్పులు చెరిగారు. ఈ యుద్ధ వాతావరణానికి americaనే కారణమని kim jong un మండిపడ్డారు. north korea ఆయుధాలను సమకూర్చుకుని తీరుతుందని స్పష్టం చేశారు. యుద్ధాన్ని నివారించడానికి లేదా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి రక్షణ వ్యవస్థను కచ్చితంగా పటిష్టం చేసుకుంటామని అన్నారు. కొరియా రీజియన్‌లో అస్థిరతకు అగ్రరాజ్యమే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఉత్తర కొరియాపై అమెరికా విరోధ వైఖరే కలిగి ఉన్నదని కిమ్ జోంగ్ ఉన్న అన్నారు. ‘ఎవరితోనూ యుద్ధం చేయాలనే ఆలోచన మాకు లేదు. దానిపై చర్చనే లేదు. కానీ, అలాంటి warను ఆపడానికి, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడం అనివార్యం’ అని ఆయన ఓ డిఫెన్స్ ఎగ్జిబిషన్‌లో మాట్లాడారు.

Also Read: ఐక్యరాజ్య సమితికి ఉత్తర కొరియా వార్నింగ్.. ‘బాలిస్టిక్ క్షిపణి’ చర్చపై ఫైర్

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ముందు నిలబడి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ, అమెరికా మాత్రం తమకు ఉత్తర కొరియాపై శత్రుత్వమేమీ లేదని చెబుతున్నది. 

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు ఆయుధ సంపత్తి కోసం పోటీ పడుతున్నాయి. రెండు దేశాలు క్షిపణుల పరీక్షలో మునిగిపోయాయి. ఉత్తర కొరియా న్యూక్లియర్ ప్లాంట్ కోసమూ కసరత్తు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కాగా, ఉత్తర కొరియా యుద్ధానికి కాలుదువ్వుతున్నాడనే ఆరోపణలతో అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా మిలిటరీ డ్రిల్స్ చేపట్టాయి.

Follow Us:
Download App:
  • android
  • ios