అమెజాన్ సంస్థలో పనిచేసే 20వేల మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని అమెజాన్ ప్రకటించింది. అయితే ఇది ఊహించిన దానికంటే తక్కువ సంఖ్యే అని చెప్పుకొచ్చింది. కరోనా ప్రారంభమైనప్పటినుండి ఇప్పటివరకు కేవలం 20వేల మందికి మాత్రమే వైరస్ సోకిందని దీనికి తాము తీసుకున్న ముందు జాగ్రత్తలే కారణమని ఈ - కామర్స్ దిగ్గజం ప్రకటించింది.

తమ సంస్థలో పనిచేసే 1.37 మిలియన్‌ల ఫ్రంట్‌లైన్ కార్మికుల డేటాతో పాటు యునైటెడ్ స్టేట్స్‌లోని హోల్ ఫుడ్స్ మార్కెట్, కిరాణా దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులూ ఈ లెక్కలో ఉన్నారు. వీరందరిలో కరోనా పాజిటివ్‌ల రేటు తాము ఊహించిన దానికంటే తక్కువగా నమోదయిందని అమెజాన్ తన ప్రకటనలో పేర్కొంది. దాదాపు 650 సైట్ల ద్వారా అమెజాన్ రోజుకు 50,000 పరీక్షలను నిర్వహించిందని సీటెల్ ఆధారిత సంస్థ తెలిపింది.
కోవిద్ కు సంబంధించి తమ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిందని దీనికోసం అమెజాన్ చాలా కష్టపడిందని ఈ సంస్థ తెలిపింది. కరోనా ప్రారంభం నుండే తమ తమ బ్రాంచుల్లో పనిచేసే ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బ్రాంచ్ ఉన్న బిల్డింగులో కొత్త కేసులు నమోదు కాగానే ఆ సమాచారాన్ని ప్రతీ ఫ్రంట్ లైన్ ఉద్యోగికీ బ్లాగ్ ద్వారా తెలిపేది.
ఒక్క హోల్ ఫుడ్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య, అమెరికా జనాభాకు సమానంగా ఉంటుంది. ఇంతమందిలో 33 వేలు మందికి మాత్రమే పాజిటివ్ అయ్యే అవకాశముందని వివరించింది.
కోవిడ్ బారిన పడకుండా ఉద్యోగులను సంరక్షించేందుకు తమ సంస్థ తీసుకున్న భద్రత చర్యలపై లాజిస్టిక్స్ కేంద్రాల్లో పనిచేసే కొంత మంది ఉద్యోగులు విమర్శించడమే కాకుండా, కరోనా సోకిన తమ సహ ఉద్యోగుల గురించిన సమాచారాన్ని పంచుకోవటానికి కూడా ఇష్టపడలేదని అమెజాన్ పేర్కొంది.