Asianet News TeluguAsianet News Telugu

చెరువులోకి దూసుకు వెళ్లిన విమానం.. ప్రయాణికులు..?

ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం అదుపుతప్పింది. ఒక్కసారిగా రన్‌వే పై నుంచి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది.

Air Niugini Boeing 737-800 flight crash-lands into Micronesia sea: Pics of freak mishap and rescue
Author
Hyderabad, First Published Sep 28, 2018, 12:21 PM IST

న్యూజిలాండ్ లో ఓ విమానం.. ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకుపోయింది. దాదాపు సగానికి పైగా విమానం ఆ చెరువులోకి మునిగిపోయింది. ల్యాండ్‌ అయ్యే సమయంలో రన్‌వే నుంచి జారిపడిన విమానం పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అయితే ఆ చెరువు లోతుగా లేకపోవడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. మైక్రోనేషియన్‌ ద్వీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్‌ న్యుగిని విమానం స్థానిక వెనో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం అదుపుతప్పింది. ఒక్కసారిగా రన్‌వే పై నుంచి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. అయితే చెరువు లోతు తక్కువగా ఉండటంతో విమానం పూర్తిగా మునగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే పడవలతో వెళ్లి ప్రయాణికులను, సిబ్బందిని కాపాడారు. కొందరు ప్రయాణికులు ఈత కొట్టుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు. అయితే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాణికులను, సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. ప్రమాదానికి గురైన ఎయిర్‌ న్యుగిని విమానం పపువా న్యూ గినియా నుంచి బయల్దేరింది. ఘటనపై పపువా న్యూ గినియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios