న్యూజిలాండ్‌లో మూడు నెలల తర్వాత కరోనాతో తొలి మరణం
న్యూజిలాండ్ లో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. గత మూడు నెలల్లో ఒక్కరే కరోనాతో మరణించారు. శుక్రవారం నాడే కరోనాతో ఒక్కరు మరణించినట్టుగా ఆ దేశం ప్రకటించింది
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ లో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. గత మూడు నెలల్లో ఒక్కరే కరోనాతో మరణించారు. శుక్రవారం నాడే కరోనాతో ఒక్కరు మరణించినట్టుగా ఆ దేశం ప్రకటించింది.50 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించారు. ఆక్లాండ్ కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 23కి చేరుకొంది. ఈ ఏడాది మే 24వ తేదీన కరోనా మరణం చోటు చేసుకొంది. ఆ తర్వాత ఇవాళ చోటు చేసుకొన్న మరణమే మొదటిది. దేశంలో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 1406కి చేరుకొన్నాయి.
కరోనా కేసులను అరికట్టేందుకు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా అర్డెర్న్ ఆంక్షలు పెట్టారు. దేశంలోని ఆక్లాండ్ లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది.భౌతిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. సెప్టెంబర్ రెండో వారంలో కోవిడ్ నియంత్రణ ఆంక్షలు కొనసాగుతాయని ప్రధాని జెసిండా ప్రకటించారు.
న్యూజిలాండ్ లో 5 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో కమ్యూనిటీ వ్యాప్తిని నివారించడంలో విజయం సాధించింది. కరోనా కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు గాను ప్రభుత్వం గత నెలలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.