ఆప్ఘనిస్తాన్ లో మరోసారి మారణ హోమం సృష్టించారు. ఉగ్రవాదులు రెచ్చిపోయి బాంబు దాడులకు పాల్పడ్డారు. హరాత్-కాందహార్ జాతీయ రహదారిపై బాంబులతో విరుచుకుపడ్డారు. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో సుమారు 34మంది దుర్మరణం చెందారు. మృతుల్లో చిన్నారులు,మహిళలు ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఈ ఘటనలో పదుల సంఖ్యలో స్థానికులు గాయాలపాలయ్యారు. కాగా.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా... ఆప్ఘాన్ ప్రభుత్వం, దాని మిత్ర దేశాలకు తాలిబన్లతో యుద్ధం జరుగుతోంది. దీని కారణంగా గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంగళవారం తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా... 23మంది గాయపడ్డారు. తాజాగా బుధవారం మరో మారణ హోమానికి పాల్పడ్డారు.