Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. పోలీస్ ఉద్యోగం చేస్తుందని కన్నకూతురి కళ్లు పోగొట్టిన తండ్రి...

పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తుందన్న కోపంతో ఓ తండ్రి కన్నకూతురిమీదే దాడి జరిపించి కళ్లు పోయేలా చేసిన దారుణ ఘటన అఫ్ఘనిస్తాన్ లో జరిగింది. అఫ్ఘాన్‌ మహిళ ఖతేరాకు చదువుకుని.. పోలిసు ఆఫీసర్‌గా ఉద్యోగం చేయాలని కల. కానీ తండ్రికి ఆడవారు బయటకు వెళ్లి చదువుకోవడం పనిచేయడం ఇష్టం లేదు. ఖతేరా బలవంతం మీద చదువుకోవడానికి అంగీకరించాడు. కానీ ఉద్యోగం మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. వెంటనే ఓ సంబంధం చూసి పెళ్లి చేసేశాడు. 

Afghan Woman Cop Khatera Shot And Blinded For Getting A Job - bsb
Author
Hyderabad, First Published Nov 10, 2020, 3:06 PM IST

పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తుందన్న కోపంతో ఓ తండ్రి కన్నకూతురిమీదే దాడి జరిపించి కళ్లు పోయేలా చేసిన దారుణ ఘటన అఫ్ఘనిస్తాన్ లో జరిగింది. అఫ్ఘాన్‌ మహిళ ఖతేరాకు చదువుకుని.. పోలిసు ఆఫీసర్‌గా ఉద్యోగం చేయాలని కల. కానీ తండ్రికి ఆడవారు బయటకు వెళ్లి చదువుకోవడం పనిచేయడం ఇష్టం లేదు. ఖతేరా బలవంతం మీద చదువుకోవడానికి అంగీకరించాడు. కానీ ఉద్యోగం మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. వెంటనే ఓ సంబంధం చూసి పెళ్లి చేసేశాడు. 

అయితే ఖతేరా భర్త ప్రోగ్రెసివ్.. ఆయన ప్రోత్సాహంతో ఖతేరా కొద్ది నెలల క్రితం అప్ఘనిస్తాన్‌లోని ఘజ్ని ప్రావిన్స్‌లోని పోలీసు స్టేషన్‌లో క్రైమ్‌ బ్రాంచ్‌లో అధికారిగా చేరారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఖతేరా డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా.. ముగ్గురు దుండగులు ఆమె మీద దాడి చేశారు. 

కత్తితో గాయపర్చడమే కాక కాల్పులు జరిపి ఆమె కళ్లు పోయేలా చేశారు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఖతేరాని ఆస్పత్రిలో చేర్చారు. ప్రాణాలు దక్కాయి కానీ కంటిచూపు కోల్పోయింది. దీంతో ఉద్యోగం పోయింది. 

తన మీద దాడిచేసింది తాలిబన్లు అని ఖతేరా, స్థానికులు చెప్తుండగా.. వారు మాత్రం ఆరోపణల్ని కొట్టి పారేశారు. తాలిబన్‌ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఖతేరా ఉద్యోగం చేయడం ఆమె తండ్రికి ఇష్టం లేదు. అతడే ఈ దాడి చేయించి ఉంటాడు. ఇది వారి కుటుంబ సమస్య. ఇందులో మా ప్రమేయం లేదు’ అని తెలిపాడు.

ఖతేరా మాట్లాడుతూ.. ‘నేను ఉద్యోగం చేయడం ఇష్టంలేక నా తండ్రి ఉద్యోగం మానేయాల్సిందిగా బెదిరించమంటూ తాలిబన్లను కోరాడు. ఏదో ఓ రోజు నాపై దాడి జరుగుతుందని తెలుసు. కనీసం ఒక్క ఏడాది అయినా ఉద్యోగం చేయాలని భావించాను. డాక్టర్లు నాకు పాక్షికంగా చూపు వస్తుందని చెప్తున్నారు. అదే నిజమైతే.. చూపు వస్తే.. వెంటనే తిరిగి ఉద్యోగంలో చేరతాను’ అని తెలిపారు.
 
ప్రస్తుతం ఖతేరా తన ఐదుగురు పిల్లలతో కలిసి కాబూల్‌లో రహస్యంగా జీవనం సాగిస్తున్నారు. ఖతేరా తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తల్లి కూడా ఆమెతో మాట్లాడడం లేదు. 

ఇక అఫ్ఘనిస్తాన్‌లో మహిళలు ఉద్యోగాలు చేయడం.. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం తాలిబన్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పెద్దగా ఇష్టం ఉండదని మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios