Asianet News TeluguAsianet News Telugu

మార‌ణ‌హోమం.. 200 మందికి కాల్చి చంపిన బందిపోట్లు

నైజీరియాలో ముష్కరులు మారణహోమం సృష్టించారు. బందిపోట్ల దాడులు కార‌ణంగా 200 మందికి పైగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. బందిపోట్ల దాడుల్లో హత్యకు గురైన 154 మందిని  తాము పాతిపెట్టినట్లు జంఫారా రాష్ట్రంలోని బాధిత గ్రామానికి చెందిన ఒక సంఘం నాయకుడు బలరాబే అల్హాజీ తెలిపారు.
 

About 200 Dead In Attacks In Northwest Nigeria, Residents Say
Author
Hyderabad, First Published Jan 9, 2022, 5:18 PM IST

నైజీరియాలో మరోసారి ముష్క‌రులు మార‌ణ‌హోమం సృష్టించారు. బందిపోట్ల దాడుల్లో ఒక్క వారంలోనే 200 మందికి పైగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయార‌ని అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. బందిపోట్ల దాడుల్లో హత్యకుగురైన 154 మందిని తాము పాతిపెట్టినట్లు జంఫారా (Zamfara) రాష్ట్రంలోని బాధిత గ్రామానికి చెందిన ఒక సంఘం నాయకుడు బలరాబే అల్హాజీ తెలిపారు. వాయువ్య నైజీరియా రాష్ట్రమైన జంఫారాలోని గ్రామాలలో ఈ వారంలో బందిపోట్ల రహస్య స్థావరాలపై సైనిక వైమానిక దాడుల జ‌రిగాయి. ఈ దాడుల అనంత‌రం సాయుధ బందిపోటు దారులు ప్ర‌తీకార దాడుల‌కు దిగారు. ఇక బందిపోటు దారులు, Nigeria సైనిక వైమానిక దాడుల నేప‌థ్యంలో చోటుచేసుకున్న ఘోరమైన ప్రతీకార దాడుల్లో దాదాపు 200 మందికి పైగా ఎక్కువ మంది చ‌నిపోయాన‌ట్టు స్థానికులు వెల్ల‌డించారు. బుధవారం నుండి గురువారం వరకు అంకా, బుక్కుయుమ్ జిల్లాల్లోని పది గ్రామాల్లో మోటారు బైక్‌లపై వచ్చిన వందలాది ముష్కరులు విధ్వంసానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. నివాసితులను కాల్చివేసి, దోపిడికి పాల్పడ్డారని, ఇళ్లను తగులబెట్టారని వాపోయారు. పది గ్రామాల పరిధిలో మరణించిన వారి మృతదేహాలను సేకరిస్తున్నామని, మృతుల సంఖ్య ఇంకా తేలలేదని స్థానికులు వెల్ల‌డించారు. 

ముష్క‌రుల దాడుల్లో చనిపోయిన వారికి సామూహిక ఖననాలను నిర్వహించడానికి సైన్యం కమ్యూనిటీలను స్వాధీనం చేసుకుంది. అయితే, బందిపోటు దాడుల్లో 58 మంది మృతి చెందినట్లు అక్క‌డి స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఈ దాడుల‌ సమయంలో తన భార్య, ముగ్గురు పిల్లలను కోల్పోయిన నివాసి ఉమ్మారు మేకేరి మాట్లాడుతూ.. బందిపోట్ల ప్ర‌తీకార దాడుల్లో వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని కాల్చి చంపారు. ఇండ్లు దోచుకెళ్లారు. ఈ దాడుల్లో మ‌ర‌ణించి వారిలో 154 మంది వ‌ర‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఖ‌న‌నం చేశామ‌ని తెలిపారు. ఈ దాడుల్లో 200 మందికి పైగా చ‌నిపోయి ఉంటార‌ని తెలిపారు. ఇప్ప‌టికీ మృత దేహాల ఆచూకీ కోసం వెతుకుతున్నామ‌ని తెలిపారు. 

జాంఫారాలోని అంకా స్థానిక ప్రాంతాల్లో బందిపోట్ల దాడుల్లో కనీసం 30 మంది మరణించారని రాయిటర్స్ నివేదించింది, మోటార్‌బైక్‌లపై 300 మందికి పైగా సాయుధ బందిపోట్లు ప‌ది గ్రామాలపై  విరుచుకుప‌డ్డారు. ప్ర‌జ‌ల పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో వంద‌ల మంది ప్రాణాలు కోల్పోయారు అని పేర్కొంది. ఇదిలావుండ‌గా, జంఫారా రాష్ట్రంలోని గుసామి అటవీ ప్రాంతం, పశ్చిమ త్సామ్రే గ్రామంలోని బందిపోట్ల లక్ష్యాలపై సోమవారం తెల్లవారుజామున వైమానిక దాడులు (military air strikes) చేశామని అక్క‌డి సైన్యం పేర్కొంది. త‌మ‌కు అందిన ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం బందిపోట్ల ఇద్దరు నాయకులతో సహా 100 మందికి పైగా బందిపోట్లు చ‌నిపోయార‌ని పేర్కొంది. త‌న పేరు చెప్ప‌డానికి నిరాక‌రించిన ఓ నివాసి మీడియాతో మాట్లాడుతూ  సంబంధిత గ్రామాల‌పై జ‌రిగిన దాడులు సైనిక దాడులతో ముడిపడి ఉండవచ్చున‌ని పేర్కొన్నారు. 

ఇదిలావుండ‌గా, వాయువ్య నైజీరియాలో చాలా కాలం నుంచి ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్నాయి. ఇక్క‌డ వ‌రుసగా ఇలాంటి దాడులు జ‌రుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా 2020 ఏడాది నుంచి ఈ ప్రాంతంలో హింస పెరిగింది. నిత్యం సామూహిక అపహరణలు, ఇతర హింసాత్మక నేరాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డి శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడటం ప్ర‌భుత్వానికి స‌వాలుగా మారింది. వాయువ్య నైజీరియా రాష్ట్రం కెబ్బిలోని తమ కళాశాల నుండి అపహరణకు గురైన 30 మంది విద్యార్థులను శనివారం విడుదల బందిపోట్లు విడిచిపెట్టిన‌ట్టు కెబ్బి గవర్నర్ వెల్ల‌డించారు. బందిపోట్ల పూర్తిగా అణ‌చివేయ‌డానికి మున్ముందు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆ దేశ అధ్య‌క్షుడు ముహమ్మదు బుహారీ (Muhammadu Buhari) ఒక ప్రకటనలో వెల్ల‌డించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios