ఫ్రాన్స్ పార్లమెంట్ లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పార్టీకి పార్లమెంట్ లో మెజారిటీ తగ్గింది. ఇంకా పూర్తి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆదివారం జరిగిన చివరి రౌండ్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంది, అయితే దాని పార్లమెంటరీ మెజారిటీ కోల్పోయింది. మాక్రాన్ అభ్యర్థులు 200 నుంచి 250 సీట్లు గెలుస్తారని పాక్షిక ఫలితాల ఆధారంగా అంచనాలు చెబుతున్నాయి. ఫ్రాన్స్ పార్లమెంట్‌లోని అత్యంత శక్తివంతమైన సభ అయిన నేషనల్ అసెంబ్లీలో ప్రత్యక్ష మెజారిటీకి అవసరమైన 289 సీట్ల కంటే ఈ సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
బైక్ పై నుంచి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. ఎలా జరిగింది?
ఫ్రాన్స్‌లో ఈ పరిస్థితి అసాధారణం. వాస్తవ ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లయితే మాక్రాన్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావచ్చు. కొత్త కూటమి దాదాపు 150 నుంచి 200 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుందని అంచనా. అంతకుముందు ఎనిమిది సీట్లు ఉన్న రైట్‌రైట్ నేషనల్ ర్యాలీకి 80 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని తెలుస్తోంది.
2050 నాటికి ప్రపంచ జనాభాలో 75 శాతం మంది కరువుకొరల్లోకి.. : ఐరాస
కాగా ఏప్రిల్ జరిగిన ప్రెసిడెంట్ రేసులో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గెలుపొందారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి మెరీన్ లీ పెన్‌పై ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పష్టమైన విజయం సాధించారు. మాక్రాన్‌కు 58% ఓట్లు రాగా, పెన్‌కు 42% ఓట్లు పడ్డాయి. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రాజకీయాల్లో గడిచిన ఐదేళ్లలో యువనేతగా ఎదిగారు. యూరోపియన్ యూనియన్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే ప్రధాన ప్రపంచ నాయకుడిగా తనను తాను మార్చుకున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా విధించిన యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో దౌత్యవేత్తగా పాల్గొన్నాడు.
