Asianet News TeluguAsianet News Telugu

పూర్తిస్థాయి అధ్యయనం చేయకుండా వ్యాక్సిన్ కు అనుమతిస్తే నష్టం: డబ్ల్యు హెచ్ ఓ

కరోనాను నివారించే వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకొన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.  కరోనాను నివారిస్తోందని రుజువు చేయని వ్యాక్సిన్ వాడితే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్ఓ అభిప్రాయపడింది.

90 percent of countries report disruptions to essential health services since COVID-19 pandemic
Author
Genève, First Published Sep 1, 2020, 1:05 PM IST

జెనీవా: కరోనాను నివారించే వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకొన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.  కరోనాను నివారిస్తోందని రుజువు చేయని వ్యాక్సిన్ వాడితే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్ఓ అభిప్రాయపడింది.

ప్రపంచంలోని సుమారు 12 సంస్థలు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి.ఈ ప్రయోగాలు తుది దశకు చేరుకొన్నాయి. 

కరోనా వైరస్ కంటే వ్యాక్సిన్ వల్లే ఎక్కువగా లాభం చేకూరే అవకాశం ఉందని నిరూపిస్తే వ్యాక్సిన్ కు వేగంగా అనుమతులు వచ్చే అవకాశం ఉందని డబ్ల్యు హెచ్ ఓ అధికారులు ప్రకటించారు.

పూర్తిస్థాయి అధ్యయనం చేయకుండానే వ్యాక్సిన్ ను  ఉపయోగిస్తే దాని వల్ల అది పనిచేసే సామర్ధ్యం తక్కువగా ఉండే అవకాశం ఉందని  డబ్ల్యు హెచ్ ఓ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడ ఇటీవలనే కీలక ప్రకటన చేశారు. కరోనా నివారించేందుకు వ్యాక్సిన్ ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశం  ఉందని ప్రకటించారు.

పలు సంస్థల క్లినికల్ ట్రయల్స్ తుది  దశకు చేరుకొన్నాయి. క్లినికల్ ట్రయల్స్  ఫలితాల ఆధారంగా వ్యాక్సిన్ కు అనుమతులు ఇచ్చే విషయాన్ని పరిశీలించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios