చంబర్లీన్: దక్షిణ డకోటాలో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో  తొమ్మిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

శనివారం మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు  విమానం కుప్పకూలింది.  ఈ ఘటనలో విమానంలో ఉన్న 9మంది మృతి చెందారు.ఈ ఘటన సియోక్స్ జలపాతానికి 225.3 కి.మీ దూరంలో  ఈ ఘటన చోటు చేసుకొంది.

దక్షిణ మధ్య  దక్షిణ డకోటా వాతావరణ శాఖ శీతాకాలపు గాలులు వీస్తాయని హెచ్చరించిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొందని  మీడియా కథనాలు వెలువడ్డాయి.ఈ ఘటనపై ఎన్‌టీఎస్‌బీ ఇన్వేస్టిగేటర్లు  విచారణ చేయనున్నట్టుగా అధికారులు ప్రకటించారు.