యుద్ధం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు యూరోపియన్ యూనియన్ ముందడగు వేసింది. ఈ మేరకు బ్రస్సెల్స్‌లో నిర్వహించిన సమావేశంలో యూరోపియన్ యూనియన్ నేతలు అంగీకారం తెలిపారు.
ఉక్రెయిన్, రష్యాకు యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల సైన్యం పోరాడుతూ ఉన్నాయి. దీంతో ఇరు దేశాలకు నష్టం వాటిల్లుతోంది. రెండు వైపులా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది. అయితే ఇందులో ఉక్రెయిన్ అధికంగా నష్టపోతోందన్న మాట వాస్తవం. అయితే యుద్ధం కారణంగా ఆర్థికంగా చిక్కుల్లో పడ్డ ఉక్రెయిన్ కు సాయం చేయడానికి యూరోపియన్ యూనియన్ ముందుకు వచ్చింది. 9 బిలియన్ యూరోలో ఇవ్వడానికి అంగీకారం తెలిపింది.
ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా తొమ్మిది బిలియన్ యూరోలు పంపేందుకు బ్రస్సెల్స్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ నేతలు అంగీకరించారని ఈయూ చీఫ్ చార్లెస్ మిచెల్ సోమవారం ప్రకటించారు. యూరోపియన్ కౌన్సిల్ ‘‘ ఉక్రెయిన్ కు తక్షణ లిక్విడిటీ అవసరాలలో సహాయం చేస్తూనే ఉంటుంది ’’ అని మిచెల్ ట్వీట్ చేశారు, శిఖరాగ్ర సమావేశం కొనసాగుతుండగా ‘‘ ఉక్రెయిన్ కు బలమైన, దృఢమైన మద్దతు’’ అంటూ ట్వీట్ చేశారు. బ్రస్సెల్స్‌లో సమావేశమైన యూరోపియన్ యూనియన్ నాయకులు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉండాలనుకున్నారని తెలిపారు. అందుకే తొమ్మిది బిలియన్ యూరోలు పంపించాలని నిర్ణయించారని చెప్పారు.
సరికొత్త హై పొటెన్షియల్ వీసా ప్రారంభించిన యూకే.. భారతీయ విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుందంటే... ?
కాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం 97వ రోజుకు చేరుకున్నాయి. నేడు రష్యన్ సైన్యం తూర్పు నగరమైన సెవెరోడోనెట్స్క్ లోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ పారిశ్రామిక హార్ట్ ల్యాండ్ కోసం యుద్ధంలో వారాల తరబడి బాంబు దాడిలో ఉన్న తూర్పు ఉక్రేనియన్ నగరమైన సెవెరోడోనెట్స్క్ కేంద్రానికి రష్యన్ దళాలు దగ్గరగా పురోగమించాయి.
‘‘ రష్యన్లు సెవెరోడోనెట్స్క్ మధ్యలో ముందుకు సాగుతున్నారు. పోరాటం కొనసాగుతూనే ఉంది. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది ’’ అని అని లుగాన్స్క్ గవర్నర్ సెర్గీ గైడే టెలిగ్రామ్ లో పేర్కొన్నారు. సెవెరోడోనెట్స్క్ ఇప్పటికీ ఉక్రేనియన్ చేతుల్లో ఉన్న తూర్పు నగరంగా ఉంది. దాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల రష్యాకు లగాన్స్క్ మీద వాస్తవమైన నియంత్రణ లభిస్తుంది. ఇది ప్రతిష్టాత్మకమైన డోన్బాస్ ను ఏర్పరుస్తున్న రెండు తూర్పు ప్రాంతాలలో ఒకటిగా ఉంది.
ఫ్రెంచ్ జర్నలిస్ట్ హత్య
బీఎఫ్ఎమ్ న్యూస్ ఛానెల్ కోసం సెవెరోడో నెట్స్క్ సమీపంలో పౌరుల తరలింపును కవర్ చేస్తున్న 32 ఏళ్ల ఫ్రెంచ్ టెలివిజన్ జర్నలిస్ట్ మరణించాడు. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఎన్జీవో లెక్కల ప్రకారం ఈ యుద్ధాన్ని కవర్ చేస్తున్నప్పుడు మరణించిన ఎనిమిదవ జర్నలిస్ట్ గా ఆయన ఉన్నారు. నిర్వాసితులతో ప్రయాణిస్తున్న మానవతావాది బస్సుపై బాంబుదాడిలో అతను మరణించాడని, అతని ఫ్రెంచ్ సహోద్యోగి గాయపడ్డాడని బీఎఫ్ఎమ్ తెలిపింది.
దీర్ఘశ్రేణి రాకెట్లకు బైడెన్ నో
సుదూర ఆయుధాలు కావాలని కైవ్ నుంచి అత్యవసర అభ్యర్థనలు ఉన్నప్పటికీ, రష్యా భూభాగంలోని లక్ష్యాలను ఛేదించగల ఉక్రెయిన్ రాకెట్ వ్యవస్థలను తాను పంపబోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ‘‘ రష్యాలోకి దాడి చేయగల ఉక్రెయిన్ రాకెట్ వ్యవస్థలకు మేము పంపబోవడం లేదు’’ అని ఉక్రెయిన్ కు బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని ప్రకటించిన బైడెన్ వాషింగ్టన్ లో అన్నారు.
