Asianet News TeluguAsianet News Telugu

జపాన్‌లో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు


జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో బుధవారం నాడు భారీ భూకంపం చోటు చేసుకొంది., భూకంప తీవ్రత 7.3 తీవ్రతగా నమోదైంది. అంతేకాదు సునామీ వార్నింగ్ కూడా ఇచ్చారు.

7.3 magnitude quake hits north Japan, tsunami alert issued
Author
Japan, First Published Mar 16, 2022, 9:01 PM IST

టోక్యో: జపాన్ లో బుధవారం నాడు భారీ భూకంపం సంబవించింది. ఉత్తర జపాన్‌లోని పుకుషిమా తీరంలో 7.3 తీవ్రతతో భూకంపం వాటిల్లింది. దీని ప్రభావంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.

సముద్రానికి 60 కి.మీ. దిగువన భూకంపం సంభవించిందని భూగర్భశాస్త్రవేత్తలు చెప్పారు. ఇదే ప్రాంతంలో 2011లో 9.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ సమయంలో సునామీ వచ్చింది. దీని ప్రభావంతో అణు ధార్మిక ప్లాంట్ లు కూడా దెబ్బతిన్నాయి.  ఈ ఘటన జరిగి  ఇప్పటికే 11 ఏళ్లు పూర్తైంది. ఇటీవలనే ఈ 11 ఏళ్ల ఘటనను ఈ ప్రాంత వాసులు గుర్తు చేసుకొన్నారు.

మియాగి, పుకుషిమా ప్రిఫెక్చర్లలో  ఒక మీటర్ వరకు సముద్రం ఉప్పెనకు గురైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios