జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని తెలియజేసింది. సునామీ హెచ్చరికను జారీ చేశారు. 

ఉత్తర సులావేసి, ఉత్తర మాలుకు మధ్య కేంద్రంగా భూకంపం 24 కిలోమీటర్ల లోతులో సంభవించింది.  తీరప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రాంతాలకు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ సునామీ హెచ్చరికను జారీ చేసింది.

ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారం తెలియడం లేదు. కానీ ఉత్తర మాలుకు ప్రోవిన్స్ లోని టెర్నాట్ సిటీ ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. దాంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.