Asianet News TeluguAsianet News Telugu

కాంగోలో ఘోరం: 50 మంది అగ్నికి ఆహుతి

కాంగోలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టేరియల్‌ హైవేపై వెళ్తున్న ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 50 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

50 Killed, 100 Burnt In Oil Tanker Road Crash In DR Congo
Author
Congo-Kinshasa, First Published Oct 6, 2018, 9:01 PM IST

కిన్‌షాస: కాంగోలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టేరియల్‌ హైవేపై వెళ్తున్న ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 50 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఆయిల్ ట్యాంకర్ పేలి రెప్పపాటులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో వాహనాల్లో ఉన్న వాళ్లు ఉన్నట్లే అగ్నికీలల్లో చిక్కుకుని సజీవ సమాధి అయ్యారు. పలు వాహనాలకు మంటలు అంటుకోవడంతో బుగ్గయ్యాయి.

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న క్షతగాత్రులు ఆర్తనాదాలతో ఆర్టేరియల్ హైవే మార్మోగింది. ఆ ప్రదేశమంతా భయంకరంగా తయారైంది. తమను రక్షించాలంటూ క్షతగాత్రులు చేస్తున్న ఆర్తనాదాలు అందర్నీ కలచివేస్తున్నాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం కారణంగా హైవేపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని కాంగో తాత్కాలిక గవర్నర్ అటో మటుబువనా ధృవీకరించారు.  

హైవే పక్కన ఇళ్లకు మంటలు అంటుకోవడంతో అవి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఆర్టేరియల్ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.  

Follow Us:
Download App:
  • android
  • ios