యెమెన్ లో ఐదుగురు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కిడ్నాప్‌నకు గురయ్యారు. ఆల్‌ఖైదా కు చెందిన ముష్కరులే కిడ్నాప్ చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అడెన్: Yemen లోని దక్షిణ ప్రావిన్స్ అబ్యాన్ లో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో పనిచేసే ఐదుగురు సిబ్బంది కిడ్నాప్ నకు గురయ్యారు. UN సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనను పూర్తి చేసుకొని అడెన్ కు తిరిగి వస్తున్న సమయంలో కిడ్నాప్ నకు గురయ్యారని అధికారులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి సిబ్బందిని యెమెన్ లోనిAL-Qaidaకు చెందిన వారు కిడ్నాప్ చేశారని అనుమానిస్తున్నారు. Kidnapనకు గురైన వారిని విడిచిపెట్టేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Abyan ఫ్రావిన్స్ కు తూర్పున ఉన్న ముదియా జిల్లాలో గుర్తు తెలియని ముష్కరులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వారు ఆల్ ఖైదా సభ్యులుగా అనుమానిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సిబ్బందిని కిడ్నాప్ చేసిన దుండుగులు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ కిడ్నాప్ నకు బాధ్యులమని ఎవరూ కూడా ప్రకటించలేదు.
అరేబియా ద్వీపకల్పంలో యెమెన్ ఆధారిత ఆల్ ఖైదా నెట్ వర్క్ ఎక్కువగా తూర్పు, దక్షిణ ఫ్రావిన్స్ లలో పనిచేస్తుంది. దేశంలో భద్రతా దళాలకు వ్యతిరేకంగా అనేక ఉన్నతస్థాయి దాడులకు బాధ్యత వహిస్తుంది.
