ఫ్లోరిడా: అమెరికా మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల ఓ బ్యాంకులో దుండగుడు కాల్పులు జరిపాడు. సెబ్రింగ్‌ నగరంలోని సన్‌ ట్రస్ట్‌ బ్యాంకులోకి వెళ్లిన దుండగుడు కాల్పులు జరిపాడు. 

దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో  ఐదుగురు పౌరులు అక్కడికక్కడే మరణించారు.దుండగుడిని సెబ్రింగ్‌కు చెందిన 21 ఏళ్ల జీపెన్‌ జావర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సాయుధుడు సన్ ట్రస్ట్ బ్యాంకులోకి చొరబడి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. విచక్షణారహితమైన కాల్పుల వల్ల తమకు నష్టం జరుగుతోందని పోలీసులు అంటున్నారు. 

కాల్పుల్లో మరణించినవారు కస్టమర్లా, బ్యాంక్ ఉద్యోగులా అనేది తెలియలేదు. తాను ఐదుగురిని కాల్చి చంపానని నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.