తమ దేశంలో 40వేల ఉగ్రవాద గ్రూపులున్నాయని... ఈ విషయాన్ని తాను అమెరికాకు చెప్పలేకపోయానని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.

గత 15 సంవత్సరాల్లో వరసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అమెరికాకు తమ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి తెలియజేయలేదని ఆయన అన్నారు. తాను మాత్రం ఉగ్రవాదంపై పోరాడుతున్నానని.. అందుకే ఆమెరికాతో చేతులు కలిపానని చెప్పారు. నవంబర్ 9వ తేదీన జరిగిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.

ఆల్ ఖైదా తమ దేశంలో లేదని.. అది ఆఫ్ఘనిస్తాన్ లో ఉందని చెప్పారు. అలాగే తమ దేశంలో తాలిబన్లు లేరని.. కానీ టెర్రరిజంపై అమెరికా జరుపుతున్న పోరులో తాము కూడా పాలుపంచుకుంటున్నామని చెప్పారు. దురుదృష్టవశాత్తు కొన్ని ఘటనలు తప్పుగా జరిగాయని... ఇందుకు తన ప్రభుత్వాన్ని తానే నిందిస్తున్నట్లు చెప్పారు.

అసలైన వాస్తవాన్ని అమెరికాకు తెలియజేయలేనందుకు చింతిస్తున్నానని అన్నారు. తన గౌరవార్థం మహిళా సెనెటర్ షీలా జాక్సన్ లీ ఇఛ్చిన రిసెప్షన్ లో పాల్గొన్న ఆయన.. పాకిస్తాన్ ప్రభుత్వాలు అసలు కంట్రోల్ లో లేవన్న విషయాన్ని విప్పి చెప్పారు.

తమ దేశంలో నలభై మిలిటెంట్ గ్రూపులు పని చేస్తున్నా… ఏంచేయాలో తోచక తనలాంటి వారు వర్రీ అయ్యారని, కానీ వాటిని అదుపు చేయడానికి ఇంకా ఏదో చేయాలని అమెరికా కోరిందని, అందుకే ఈ పోరాటంలో మేము కూడా భాగస్వాములమయ్యామన్నారు. పాకిస్తాన్ తన సొంత మనుగడకోసం పోరాడుతోందని చెప్పిన ఇమ్రాన్.. ఈ దేశాధ్యక్షుడు ట్రంప్ తోను, ఇతర నేతలతోనూ తాను భేటీ కావడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు.