న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో మసీదులో చోటు చేసుకున్న కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది. శుక్రవారం కావడంతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు.

నల్లరంగు దుస్తులు ధరించిన ఓ సాయుధుడు అల్ నూర్ మసీదులోకి చొరబడి ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తొలుత నలుగురు మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. సహాయకచర్యల్లో మృతదేహాలు బయటపడుతున్నాయి.

దాడి సమయంలో మసీదులో సుమారు 300 వరకు ఉన్నట్లు సమాచారం. మరోవైపు కాల్పులకు తెగబడ్డ వ్యక్తి ఈ దాడినంతా లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారెంట్‌గా గుర్తించారు. ఇతని కోసం న్యూజిలాండ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.