Asianet News TeluguAsianet News Telugu

క్రిమియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయ వైద్య విద్యార్థుల దుర్మరణం 

క్రిమియాలో గురువారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. వారంతా పాతికేళ్ల లోపు వయస్సున్న వైద్య విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులేనని సమాచారం.

 

4 Indian students killed in car accident in Crimea
Author
First Published Dec 30, 2022, 4:08 AM IST

క్రిమియాలోని అలుష్టాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వారంతా పాతికేళ్ల లోపు వయస్సు ఉన్న భారతీయ వైద్య విద్యార్థులేనని సమాచారం. వేగంగా వెళ్తూ, అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరూ మెడిసిన్ మూడవ సంవత్సరం కాగా.. మిగిలిన ఇద్దరు విద్యార్థులు మెడిసిన్ నాల్గవ సంవత్సరం చదువుతున్నట్టు తెలుస్తుంది.

రష్యా అధికారిక స్థానిక వార్తాసంస్థ రియా నొవొస్టి సమాచారం ప్రకారం.. ఈ సంఘటన క్రిమియన్ కాలమానం ప్రకారం 03:30 గంటలకు జరిగింది. నలుగురు విద్యార్థులు రెనాల్ట్ లోగాన్ కారులో  క్రిమియాలోని సెర్గీవ్ సెన్స్కీ స్ట్రీట్ నుంచి సెయింట్ సిమ్ ఫెరొపోల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు.

అక్కడి మీడియా కథనం ప్రకారం నలుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందిన కేసును పోలీసులు విచారిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా, డ్రైవర్ కారుపై అదుపు కోల్పోయాడని, దాంతో వేగంగా వెళ్తున్న కారు ప్రమాదానికి గురైందని పోలీసులు భావిస్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి సమాచారం ఇచ్చింది.

దక్షిణ కొరియాలో బస్సు, ట్రక్కు మంటలు

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో బస్సు, ట్రక్కు ఢీకొనడంతో సొరంగంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 6 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా 37 మంది గాయపడ్డారు. లారీలో ఉన్న సరుకులు ఏంటీ, ప్రమాదం సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే సమాచారం లభించలేదు.

ప్రమాద సమాచారం తెలియగానే.. అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగారు. పలు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో ఇది జరిగినట్లు సమాచారం.అగ్నిమాపక శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మంటలను అదుపు చేసేందుకు 50 అగ్నిమాపక దళం వాహనాలు, 140 అగ్నిమాపక సిబ్బంది, హెలికాప్టర్లను సంఘటనా స్థలానికి పంపారు.

పొగమంచు కారణంగా  చైనాలో ఘోర ప్రమాదం  

చైనాలోని జెంగ్‌జౌ నగరంలో దట్టమైన పొగమంచు కారణంగా, బుధవారం ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదంలో సుమారు 200 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో, వంతెనపై చిక్కుకున్న వ్యక్తులు వీడియోలు చేస్తూ సహాయం కోసం వేడుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios