Asianet News TeluguAsianet News Telugu

విషాదం నింపిన విహారం.. ఇటలీలో బోటు బోల్తా.. నలుగురి మృతి..

ఉత్తర ఇటలీలోని మగ్గియోర్ సరస్సులో పర్యాటకుల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. రెస్క్యూ టీమ్ ప్రకారం..గంటలపాటు కొనసాగిన ఆపరేషన్ తర్వాత సుమారు 20 మందిని రక్షించారు. ఈ ప్రమాద సమయంలో పడవలో 24 మంది ప్రయాణిస్తున్నారు.

4 Dead After Boat Capsizes In Italy's Lake Maggiore KRJ
Author
First Published May 30, 2023, 6:57 AM IST

ఇటలీలోని మగ్గియోర్ సరస్సులో విషాదం ఘటన చోటు చేసుకుంది. విహార యాత్ర కాస్తా విషాదాన్ని నింపింది. సరస్సులో సరస్సులో పర్యాటకుల పడవ బోల్తా పడింది. ఈ బోటు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆకస్మిక తుఫాను కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. ఈ ఘటనను ఇటలీ అగ్నిమాపక దళం ధృవీకరించింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం..ఆదివారం (మే 28) సాయంత్రం అకస్మాత్తుగా ప్రతికూల వాతావరణం కారణంగా పడవ సెస్టో క్యాలెండే, అరోనా పట్టణాల మధ్య బోల్తా పడింది. అగ్నిమాపక శాఖ అధికార ప్రతినిధి లూకా కరీ మాట్లాడుతూ.. నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఒక వ్యక్తి కోసం రిస్కూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. చనిపోయిన వారిలో ఇద్దరు ఇటాలియన్లు ఉన్నారు. ఇందులో ఒక వ్యక్తి మధ్య వయస్కుడు కాగా.. ఓ మహిళ. వీరి మృతదేహాలు వెలికి తీశారు. దీంతో పాటు రష్యాకు చెందిన మహిళ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. 

ప్రతికూల వాతావరణం కారణంగా పడవ బోల్తా 

ఈ ప్రమాదానికి సంబంధించి లోంబార్డి రీజియన్ ప్రెసిడెంట్ అటిలియో ఫోంటానా మాట్లాడుతూ.. ఆదివారం సుడిగాలి కారణంగా పడవ బోల్తా పడిందని, అందులో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. అకస్మాత్తుగా వచ్చిన తుఫాను కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా వాతావరణం చెడుగా మారింది. దాని కారణంగా సరస్సు మధ్యలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందిని రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు. రక్షించబడిన వారిలో ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు.  

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 

మీడియా కథనాల ప్రకారం.. డైవర్లు హెలికాప్టర్ సహాయంతో ఉత్తర లాంబార్డి ప్రాంతంలోని లేక్ మాగియోర్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. విశేషమేమిటంటే..ఇటలీలోని రెండవ అతిపెద్ద సరస్సు అయిన మగ్గియోర్ సరస్సు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios