గాజాపై ఇజ్రాయిల్ వైమానిక దాడి: 35 మంది మృతి
ఇజ్రాయిల్, హమాస్ మధ్య మంగళవారం నాడు రాత్రి పూట వైమానిక దాడులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో గాజాలో 35 మంది ఇజ్రాయిల్‌లో ఐదుగురు చనిపోయారు.
గాజా: ఇజ్రాయిల్, హమాస్ మధ్య మంగళవారం నాడు రాత్రి పూట వైమానిక దాడులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో గాజాలో 35 మంది ఇజ్రాయిల్‌లో ఐదుగురు చనిపోయారు.ఇస్లామిక్ గ్రూప్, ఇతర పాలస్తీనా ఉగ్రవాదులు టెల్ అవీవ్ , బీర్జెబా వద్ద రాకెట్ బ్యారేజీలను పేల్చడం ద్వారా ఇజ్రాయిల్ బుధవారం నాడు గాజాలో వైమానిక దాడులకు దిగింది. వైమానిక దాడులతో గాజాలోని ఓ బహుళ అంతస్తుల నివాస భవనం కూలిపోయింది, మరొక భవనం దెబ్బతింది.బుధవారం నాడు తెల్లవారుజామున తమ జెట్ విమానాలు హమాస్ ఇంటలిజెన్స్ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్టుగా ఇజ్రాయిల్ ప్రకటించింది. 2014 గాజాలో జిరిగిన యుద్దం తర్వాత ఇజ్రాయిల్ , హమాస్ మధ్య ఇంత పెద్ద దాడి జరగడం ఇదే పెద్దది. వెంటనే దాడులను నిలిపివేయాలని యుఎస్ మిడిల్ ఈస్ట్ శాంతి ప్రతినిధి టోర్ వెన్నెస్లాండ్ ట్వీట్ చేశారు.
బుధవారం నాడు ఉదయం వైమానిక దాడులతో ఇజ్రాయిల్ వాసులు రక్షణ కోసం పరుగులు తీశారు. 70 కి.మీ కంటే ఎక్కువ దూరం దక్షిణ ఇజ్రాయిల్ లో పేలుళ్ల శబ్దాలు విన్పించినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. టెల్ అవీవ్ సమీపంలోని మిశ్రమ అరబ్-యూదు పట్టణంలో వాహనాన్ని రాకెట్ ఢీకొని ఇద్దరు మరణించారని ఇజ్రాయిల్ మీడియా తెలిపింది. గాజా నగరంలోని టవర్ భవనాలపై బాంబు దాడులకు ప్రతిస్పందనగా బీర్‌షెబా టెల్ అవీవ్ వైపు 210 రాకెట్లను ప్రయోగించిన్టుగా హమాస్ సాయుధ విభాగం తెలిపింది.
రాకెట్ దాడుల నుండి తనను రక్షించుకొనే హక్కు ఇజ్రాయిల్‌కు ఉందని వైట్ హౌస్ అభిప్రాయపడింది. గాజాపై బాంబుదాడి చేయడానికి 80 జెట్లను పంపినట్టుగా ఇజ్రాయిల్ తెలిపింది. ఇజ్రాయిల్ వైమానిక దాడులతో కూల్చివేసిన తరువాత 13 అంతస్థుల గాజా రెసిడెన్షియల్, ఆఫీస్ బ్లాక్ లో పెద్ద ఎత్తున పొగ వెలువడుతున్న వీడియో మంగళవారం నాడు మీడియా ప్రసారం చేసింది. గాజాలో సైనిక పరిశోధన, సైనిక ఇంటలిజెన్స్ భవనాలకు పక్కనే బహుళ అంతస్థుల భవనం ఉన్నట్టుగా ఇజ్రాయిల్ తెలిపింది. రాజకీయ నాయకులు, అధికారులు మీడియాతో మాట్లాడేందుకు హమాస్ కార్యాలయానికి ఉపయోగిస్తారు.
వైమానిక దాడులకు ముందు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్థానికులను హెచ్చరించినట్టుగా ఇజ్రాయిల్ ప్రకటించింది. గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారుల లెక్కల ప్రకారంగా ఇజ్రాయిల్ దాడిలో 32 మంది మరణించారు. అయితే హమాస్ అనుబంధ రేడియో స్టేషన్ మరో ప్రకటన చేసింది. బుధవారం నాడు ఉదయం 2 గంటలకు ఒక మహిళ, పిల్లలతో పాటు ముగ్గురు మరణించినట్టుగా తెలిపింది. డజన్ల కొద్దీ ఉగ్రవాదులను వారు ఉపయోగించే భవనాలను ధ్వంసం చేసినట్టుగా ఇజ్రాయిల్ ప్రకటించింది. టెల్ అవీవ్ శివారు ప్రాంతంలో రిషాన్ లెజియన్ భవనాన్ని రాకెట్ ఢీకొట్టడంతో 50 ఏళ్ల మహిళ మృతి చెందిందని ఇజ్రాయిల్ కు చెందిన మాగెన్ డేవిడ్ అడోమ్ అంబులెన్స్ సర్వీసెస్ తెలిపింది. అష్కెలోన్ పై రాకెట్ దాడుల్లో ఇద్దరు మహిళలు మరణించారని తెలిపింది.