సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదీనా ప్రావిన్స్ లోని అల్ అఖల్ సెంటర్ వద్ద యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు... భారీ వాహనాన్ని ఢీ కొట్టింది. మక్కా మసీదు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 7గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా... ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 35మంది విదేశీయులు మృతి చెందారు.

కాగా... పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను అల్ హమ్నా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన బస్సులో ఏషియన్, అరబిక్ పౌరులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. కాగా... ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.