భారత్- చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి చోటు చేసుకున్న 20 మంది భారత జవాన్లు అమరులవ్వగా.. మరో నలుగురి పరిస్ధితి విషమంగా ఉంది.

ఈ ఘటనలో మరణించిన సైనికుల గురించి చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఘర్షణలో 35 మంది చైనా సైనికులు చనిపోయినట్లు అమెరికా నిఘా వర్గాల సమాచారం.

Also Read:పుట్టిన బిడ్డ ముఖం కూడా చూడకుండానే...

భారత సైనికులే అక్రమంగా తమ భూభాగంలోకి చొరబడి, దాడికి పాల్పడ్డారని చైనా ఆరోపణలు గుప్పిస్తోంది. సరిహద్దులలో పరిస్ధితి గంభీరంగా ఉందని, భారత్ తక్షణం తన దళాలను అదుపులో ఉంచి, ఏకపక్షంగా వ్యవహరించవద్దని చైనా విదేశాంగ శాఖ కోరింది.

అయితే తమవైపు తీవ్రమైన ప్రాణ నష్టం జరిగినట్లు చైనా పీపుల్స్ ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. డ్రాగన్ దేశానికి చెందిన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ టాప్ ఎడిటర్ కూడా చైనా సైన్యం వైపు నష్టం జరిగిందని చెప్పారు.

Also Read:అమరుడైన కల్నల్ సంతోష్ బాబు తల్లితో చెప్పిన చివరి మాటలు...

కానీ ప్రాణ నష్టంపై మాత్రం చైనా మౌనంగా ఉందని ఆయన అన్నారు. మరోవైపు భారత్- చైనాల మధ్య నెలకొన్న పరిస్ధితులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరు దేశాలు సంయమనం వహించాలని కోరింది.

హాంకాంగ్ వ్యవహారం, ఆర్ధిక సంక్షోభం, అమెరికాతో పెరుగుతున్న దూరం వంటి సమస్యల నుంచి దేశ ప్రజలను మళ్లించాల్సిన అవసరం ఉండటంతో చైనా ఈ వ్యూహానికి తెరతీసినట్లు రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.