గ్వాటెమాలలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జనం మీదకు ట్రక్కు దూసుకెళ్లడంతో 32 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి  వెళితే.. నౌహులా మున్సిపాలిటీలోని సొలోలాలో బుధవారం రాత్రి ఓ కారు, పాదచారున్ని ఢీకొట్టడంతో అతను రోడ్డు మీద పడిపోయాడు.

అతనికి ఏమైందోనని జనం కంగారుగా అక్కడ గుమికూడారు. ఆ సమయంలో ట్రక్కు లైట్లు పనిచేయకపోవడంతో, చీకటిగా ఉండటంతో రోడ్డుపై ఉన్న జనాన్ని డ్రైవర్ గుర్తించలేకపోవడంతో వేగంగా వారిని ఢీకొట్టింది.

ట్రక్కు వేగానికి జనం రోడ్డుకు ఇరువైపులా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 32 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.. సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు  చేపట్టారు. ఈ ఘటనపై దేశాధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.