టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగి.. 26మంది సజీవదహనమైన సంఘటన చైనాలో చోటుచేసుకుంది. 26మంది ప్రాణాలు కోల్పోగా మరో 28మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య చైనాలోని హ్యూనన్‌ ప్రావిన్స్‌ చాంగ్డే పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 56 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో 53 మంది ప్రయాణికులు కాగా.. ఇద్దరు డ్రైవర్లు, ఓ టూరిస్ట్‌ గైడ్‌ ఉన్నారు. బస్సులో ఉన్న వస్తువులు మంటలు అంటుకోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. డ్రైవర్లు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.