న్యూయార్క్: అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్నడేవిడ్ హెడ్లీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. 26/11 ముంబై పేలుళ్ల  సూత్రధారిగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా డేవిడ్ హేడ్లీ నిందితుడిగా ఉన్నాడు.

అమెరికాలోని చికాగో జైలులో ప్రస్తుతం హెడ్లీ జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.  తోటి ఖైదీలు దాడికి దిగడంతో  హేడ్లీ తీవ్రంగా గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. ఈ దాడిలో హేడ్లీ తీవ్రంగా గాయపడ్డారు.పరిస్థితి విషమంగా మారడంతో  ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

అయితే తీవ్రంగా గాయాలు కావడంతో ఐసీయూలో ఉంచి హెడ్లీకి చికిత్సను అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ముంబైలో 2008 నవంబర్ 26 నుండి 29 వరకు లష్కరే తొయిబా ఉగ్రవాదులు వరుసగా జరిపిన దాడుల్లో 164 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో 308 మంది గాయపడ్డారు.26/11 దాడుల కేసుపై వీడియో కాన్పరెన్స్ ద్వారా డేవిడ్ హెడ్లీని  ముంబై కోర్టు విచారించింది.అయితే  తోటి ఖైదీలు హెడ్లీపై ఎందుకు దాడికి పాల్పడ్డారనే విషయమై ఇంకా అధికారులు ధృవీకరించాల్సి ఉంది.