Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియా బీచ్‌లో 2,500 మందితో న్యూడ్ ఫొటోషూట్.. సోషల్ మీడియాలో ఫొటోలు

ఆస్ట్రేలియాలో 2,500 మంది మోడళ్లు బొండీ బీచ్‌లో న్యూడ్‌గా ఫొటోకు పోజు ఇచ్చారు. స్కిన్ అవేర్‌నెస్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ ట్యూనిక్ న్యూడ్ ఫొటోషూట్ నిర్వహించారు.
 

2500 nude photoshoot at australia beach for awareness event of skin cancer
Author
First Published Nov 27, 2022, 7:27 PM IST

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా బీచ్‌లో 2,500 మంది న్యూడ్‌గా నిలబడి ఫొటోకు పోజు ఇచ్చారు. సిడ్నీలోని బొండీ బీచ్‌లో ఉదయించే సూర్య కిరణాల వెలుగులో 2,500 మంది నగ్నంగా వరుసలో నిలబడ్డారు. స్కిన్ క్యాన్సర్ అవగాహన కోసం వీరంతా న్యూడ్ ఫొటోషూట్ కోసం నిలబడగా.. ప్రముఖ అమెరికా ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ ట్యూనిక్ క్లిక్‌మనిపించాడు. ఆస్ట్రేలియన్లు రెగ్యులర్‌గా స్కిన్ టెస్టులు చేసుకోవాలని ప్రోత్సహిస్తూ ఈ ఫొటోషూట్ చేపట్టారు. న్యూయార్క్‌కు చెందిన స్పెన్సర్ ట్యూనిక్ ప్రపంచ ప్రసిద్ధ ప్రాంతాల్లో సమూహాలతో న్యూడ్ ఫొటోషూట్ చేయడంలో పేరుపొందిన వ్యక్తి.

నగ్నంగా పోజు ఇచ్చిన ఈ మోడళ్ల ఫొటోను స్పెన్సర్ ట్యూనిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అందులో ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో కీలక వివరణ ఇచ్చారు. బొండీ బీచ్‌లో ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలకు తమ అనాచ్ఛాదిత దేహాలను చూపుతూ వేలాది మంది మోడళ్లు వరుసగా నిలబడ్డారని వివరించారు. క్యాన్సర్ కారణంగా మరణించినవారికి నివాళిగా వీరంతా నిలబడ్డారని తెలిపారు. అంతేకాదు, ఈ క్యాన్సర్‌కు ప్రస్తుత తరం అడ్డుకట్ట వేసి తీరుతామనే సంకల్పంతో ఈ అవేర్‌నెస్ ఈవెంట్‌లో పాల్గొన్నారని వివరించారు.

Also Read: న్యూడ్‌ షోతో వివాదాలు.. సంచలనం సృష్టించిన తారల ఫోటో షూట్స్‌

స్కిన్ క్యాన్సర్‌తో ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశం ఆస్ట్రేలియా అని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ పేర్కొన్నట్టు బీబీసీ రిపోర్ట్ చేసింది. స్కిన్ క్యాన్సర్ అవేర్‌నెస్ వీక్ సందర్భంగా స్కిన్ చెక్ చాంపియన్స్ చారిటీతో కలిసి ఈ ఫొటోషూట్‌ను ట్యూనిక్ నిర్వహించారు. 

ఈ ఫొటోషూట్‌లో పాల్గొన్న 77 ఏళ్ల బ్రూస్ ఫిషర్ మాట్లాడుతూ, తాను తన సగం జీవితం ఎండలోనే గడిపానని, దాని ద్వారా తన వీపు తీవ్రంగా ప్రభావితమైనట్టు వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం ఒక మంచి సమస్యపై నిర్వహిస్తున్నారని తెలిపారు. బొండీ బీచ్‌లో దుస్తులు తొలగించడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios