ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మురికి కాలువలో పడి 24మంది మృతి చెందిన సంఘటన పాకిస్థాన్ లోని ఖైబర్ ఫక్తూన్ ఖవా ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఖైబర్ ఫక్తూన్‌ఖవా అప్పర్ కోహిస్థాన్ జిల్లా కుండియా తహసీల్ పరిధిలోని బాగ్రా ప్రాంతంలో వేగంగా వస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ మురుగుకాల్వలో పడింది.

 ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది మరణించారు. పాకిస్థాన్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను వెలికితీశారు. వేగంగా వస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ మురుగుకాల్వలో పడిందని పాక్ సివిల్ డిఫెన్స్ చీఫ్ వార్డెన్ అహసన్ ఉల్ హఖ్ చెప్పారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.