అబుదాబి ఎయిర్ పోర్టు సమీపంలోని జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
దుబాయ్: అబుదాబి airport కు సమీపంలో సోమవారం నాడు జరిగిన drone దాడిలో ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు Indians సహా మరొకరు మరణించిన్టుగా అధికారులు తెలిపారు. అబుదాబిలోని ప్రధాన చమురు నిల్వకేంద్రానికి సమీపంలో చమురు ట్యాంకులను డ్రోన్ ద్వారా పేల్చివేయడతో ఇద్దరు భారతీయులు సహా ఒక pakistan వాసి మరణించారు. మరో ఆరుగురు గాయపడినట్టుగా స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడికి తామే బాధ్యులమని houthi ప్రకటించింది.
అంతకుముందు Abu Dhabi నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన డిపోల సమీపంలో మూడు ఇంధన ట్యాంకులు పేలినట్టుగా స్థానిక మీడియా తెలిపింది. హౌతీ సైనిక ప్రతినిధి యుహ్యా సారీ మీడియాతో మాట్లాడారు. UAE భూభాగంలో సైనిక ఆపరేషన్ ను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు.
హౌతీలు యూఏఈ నౌకను స్వాధీనం చేసుకొన్న కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకొంది. నౌకను, నౌకలోని సిబ్బందిని వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది.
2019 సెప్టెంబర్ 14న Saudi Arabia లోని రెండు కీలక చమురు స్థావరాలను యెమెన్ కు చెందిన Houthi తిరుగుబాటు దారులు దాడులు చేశారు. ఈ దాడుల వల్లే పర్షియన్ గల్ప్ లో ఉద్రిక్తతలు పెరిగాయి.Drone దాడితో మూడు Fuel Tankerలో మంటలు వ్యాపించాయి. అంతేకాదు UAE కొత్త విమానాశ్రయంలో మంటలు వ్యాపించినట్టుగా పోలీసులు తెలిపారు. ముసఫా ప్రాంతంలోని మూడు ఇంధన ట్యాంకర్లు పేలిపోయాయని పోలీసులు వివరించారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే డ్రోన్ గా ఉండే చిన్న విమానం భాగాలు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపైదర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
యూఏఈ మద్దతున్న సంకీర్ణ అనుకూల దళాలు యెమెన్ లోని షాబ్వా, మారిబ్ లలో హౌతీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. 2019లో యూఏఈ యెమెన్ లో తన సైనిక ఉనికిని చాలా వరకు తగ్గించింది. హౌతీలు సౌదీ అరేబియాపై సరిహద్దు క్షిపణి, డ్రోన్ దాడులను పదే పదే చేస్తున్నాయి. గతంలో కూడా యూఏఈపై దాడి చేస్తామని బెదిరించిన విషయం తెలిసిందే.
ఇటీవల కాలంలో హౌతీలు స్వాధీనం చేసుకొన్న ర్వాబీ నౌకలో ఉన్న ఏడుగురు భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ గత వారం ప్రకటించింది. ఈ నెల 2న హౌతీలు ర్వాబీ ఓడను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటన తర్వాత పరిణామాలను ఇండియా నిశితంగా పరిశీలిస్తొంది., హౌతీలు, సౌదీల మధ్య సుదీర్ఘకాలంగా సంఘర్షణ కొనసాగుతుంది.
రెండు ఓడరేవులను హౌతీ బలగాలు మిలటరీ స్థావరాలుగా ఉపయోగించుకోవడం వాటిని చట్టబద్దమైన సైనిక లక్ష్యాలుగా మారుస్తుందని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ తుర్కీ ఆల్ మల్కీ గత వారం చెప్పారు.
