కరాచీ: పాకిస్తాన్‌లోని క్వెట్టాలో శుక్రవారం నాడు బాంబు పేలుడులో 14 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

 క్వెట్టాలోని హజర్‌గంజీ ఏరియాలో బాంబు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతి చెందారు.అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

బాంబు ధాటికి  సమీపంలోని భవనాలు కూడ ధ్వంసమైనట్టుగా పోలీసులు చెప్పారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.