అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశాన్ని దెబ్బ తియ్యని విధంగా కరోనా వైరస్ అమెరికాను దెబ్బ తీసింది. ప్రపంచ దేశాల అన్నిటిలోనూ అడ్వాన్స్ గా ఉండే అమెరికా ఇప్పుడు కంటికి కనిపించని వైరస్ దెబ్బకు విలవిలలాడుతోంది. గత కొన్ని రోజులు నుంచి అక్కడ ఏ స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.

Also Read నిన్న బెదిరించాడు.. నేడు స్వరం మార్చి.. ట్రంప్ కొత్త ధోరణి...

ఇప్పటి వరకు దాదాపు 13లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 5లక్షల మందికి ఈ వైరస్ పాకింది. అయితే...  అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు. 11మంది భారతీయులు... అమెరికాలో కరోనా కాటుకి బలయ్యారని అక్కడి అధికారులు ధ్రువీకరించారు.

మరో 16మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. వారు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వైరస్ సోకి చనిపోయిన భారతీయులంతా మగవారే కావడం గమనార్హం.

వారిలో పది మంది న్యూ యార్క్ కి చెందిన వారు కాగా.. మరొకరు న్యూ జెర్సీకి చెందిన వారు కావడం గమనార్హం. ఇక మరో 16మందికి వైరస్ సోకినట్లు గుర్తించగా.. వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.

ఇదిలా ఉండగా.. న్యూ యార్క్ లో ఇప్పటి వరకు 6వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 1,38,000మందికి వైరస్ సోకింది. ఇక న్యూ జెర్సీలో 1500 మంది చనిపోగా.. మరో 48వేల మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు.