Asianet News TeluguAsianet News Telugu

ప్రాణాంతక పోవాసాన్ వైరస్‌తో యూఎస్‌లో ఒకరు మృతి.. పేల ద్వారా వ్యాప్తి.. లక్షణాలు, చికిత్స వివరాలు ఇవే..

ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రకరకాల వైరస్‌లు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అమెరికాలో అత్యంత ప్రాణాంతకమైన పోవాసాన్ వైరస్ సోకి ఒకరు మరణించారు.

1 Killed In US By Powassan Virus Disease  All You Need To Know About The Virus ksm
Author
First Published May 27, 2023, 11:38 AM IST

ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రకరకాల వైరస్‌లు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అమెరికాలో అత్యంత ప్రాణాంతకమైన పోవాసాన్ వైరస్ సోకి ఒకరు మరణించారు. మైనే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (మైనే సీడీసీ) ప్రకారం.. ఒక వ్యక్తి ఇటీవలే ప్రాణాంతక పోవాసాన్ వైరస్ బారిన పడి మరణించారు. ఇది ఈ ఏడాది మైనేలో పోవాసాన్ వైరస్ తొలి కేసుగా నివేదించబడింది. పోవాసాన్  అంటువ్యాధులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ.. ఇటీవలి సంవత్సరాలలో ముఖ్యంగా యూఎస్, కెనడా, రష్యాలలో సంక్రమణ పెరిగింది. ఈ క్రమంలోనే దీని గురించి ప్రపంచ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

2015 నుంచి మైనేలో దాదాపు 15 ఇన్ఫెక్షన్ నమోదైన తర్వాత.. గత సంవత్సరం రెండు మరణాలు నమోదయ్యాయి. తాజా మరణంతో మరణాల సంఖ్య మూడుకు చేరింది. ఇక, ది ఇండిపెండెంట్ ప్రకారం.. యూఎస్‌లో ప్రతి సంవత్సరం 25 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ వైరస్‌ గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. వైరస్ లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం.. 

వైరస్ ఎలా సోకుతుంది.. 
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. పొవాసాన్ వైరస్ జింక పేలు, గ్రౌండ్‌హాగ్ పేలు లేదా ఉడుత పేలు వంటి సోకిన కాటు ద్వారా వ్యాపిస్తుంది. చాలా కేసులు ఈశాన్య, గ్రేట్ లేక్స్ ప్రాంతాల నుండి వసంతకాలం చివరి నుంచి మధ్య శరదృతువు వరకు నివేదించబడ్డాయి. ఈ సమయంలో పేలు చాలా చురుకుగా ఉంటాయి.

వైరస్ లక్షణాలు..
-పొవాసాన్ వైరస్ సోకినవారిలో ప్రారంభ రోజుల్లో జ్వరం, తలనొప్పి, వాంతులు, బలహీనత లక్షణాలను అనుభవించవచ్చు.
- వైరస్ మెదడు సంక్రమణ (ఎన్సెఫాలిటిస్) లేదా మెదడు, మెనింజైటిస్ చుట్టూ పొరలను ఏర్పరుస్తుంది.
- తీవ్రమైన సందర్భాల్లో, రోగులు గందరగోళం, సమన్వయం కోల్పోవడం, మాట్లాడటం కష్టం, మూర్ఛలతో బాధపడవచ్చు.

వైరస్ నిర్ధారణ..
ప్రాణాంతక వైరస్ సోకిన వారు వారు వైద్యులను సంప్రదించాలి. రోగి సంకేతాలు, లక్షణాల ఆధారంగా రక్తం, వెన్నెముక ద్రవాన్ని ప్రయోగశాలలో పరీక్షల ద్వారా వారి పరిస్థితిని నిర్ధారిస్తారు.

చికిత్స..
-పొవాసాన్ వైరస్ సంక్రమణ కేసులకు చికిత్స చేయడానికి నిర్దిష్ట మందులు లేనప్పటికీ.. సీడీసీ చెప్పినట్లుగా లక్షణాలు ఉపశమనం కోసం వైద్యులు తరచుగా ఓటీసీ మందులను సూచిస్తారు.
- వైద్యులు పూర్తి విశ్రాంతిని సూచిస్తారు. రోగుల ఆహారంలో ద్రవాలు ఎక్కువ ఉండేలా చూస్తారు. 
- లక్షణాల నుంచి కోలుకోవడానికి వైద్యులు ఓవర్-ది-కౌంటర్ నొప్పి మందులను కూడా సూచిస్తారు.
- తీవ్రమైన లక్షణాలతో ఉన్నవారు క్రమంగా శ్వాస తీసుకోవడానికి, హైడ్రేటెడ్‌గా ఉండటానికి, మెదడులో వాపును తగ్గించడానికి మద్దతు పొందడానికి ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios