నాన్నా.. నాన్నా... అంటూ చిన్నారుల ఏడుపులు: వలసదారులపై ట్రంప్ కాఠిన్యం

'Papa! Papa!' Audio of kids stokes rage over separation
Highlights

ట్రంప్ పై  విమర్శలు 

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు  వలసదారుల పిల్లలకు ఇబ్బందిగా మారుతున్నాయి. తల్లిదండ్రుల నుండి పిల్లలను వేరు చేయడంతో  పిల్లలు తల్లిదండ్రుల కోసం తల్లడిల్లిపోతున్నారు.  కన్నప్రేమకు దూరమౌతున్నారు. చిన్నతనంలో  పిల్లలు తల్లిదండ్రుల ఆలనా పాలన అందాల్సి ఉంది. అయితే ఈ తరుణంలో  పిల్లలు మాత్రం వారి  ప్రేమకు దూరమౌతున్నారు. 

అమెరికాలో వలసదారుల నుండి  బలవంతంగా లాక్కెళ్లి ఓ శిబిరంలో ఉంచుతున్నారు. తల్లిదండ్రులను పిల్లలను దూరంగా ఉంచుతున్నారు.  తమను ఎందుకు శిబిరంలో ఉంచుతున్నారనే విషయం అర్ధం కాక పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. 

అగ్రరాజ్యం మాత్రం నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులను, పిల్లలను విడదీస్తోంది. అక్రమ వలసదారులను వెళ్లగొట్టాలనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్రమ వలసదారులను గుర్తిస్తే వారి నుంచి చిన్నారులను విడదీసి తల్లిదండ్రులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తోంది. అయితే అమెరికా  విధానాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వలసదారుల శిబిరంలో ఉంటున్న  ఓ చిన్నారి  స్పానిష్‌ భాషలో  చిన్నారి ‘పాపా, పాపా’ అంటూ తండ్రి కోసం ఏడుస్తోన్న ఆడియో టేప్‌ ఇప్పుడు ఎంతో మంది హృదయాలను కదిలిస్తోంది. దీంతో ట్రంప్‌ యంత్రాంగంపై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. 

ఆ ఆడియో టేప్‌ను ప్రొపబ్లికా అనే ఎన్జీవో తొలుత రిపోర్ట్‌ చేసింది. తర్వాత ది అసోసియేటెడ్‌ ప్రెస్‌ దాన్ని విడుదల చేసింది. ఆడియోలో కొందరు పాపి (స్పానిష్‌లో నాన్న), మామి(స్పానిష్‌లో అమ్మ) కావాలని ఏడుస్తుండగా, కొందరు తమ తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు చెప్పి తమవాళ్లకు ఫోన్‌ చేయాలని అక్కడి అధికారులను వేడుకుంటున్నారు. 


 

loader