భారతీయ రుచులకు ప్రపంచం జేజేలు పలుకుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మన దేశ వంటకాలను రుచి చూసి ప్రశంసల జల్లు కురిపిస్తుంటారు. అలాంది అమెరికాకు చెందిన టామ్ నికోలస్ అనే ప్రోఫెసర్‌ మాత్రం మన వంటకాలపై పెదవి విరిచాడు.

భారతీయ వంటకాలు చాలా దారుణంగా ఉంటాయి.. నూనెలు ఎక్కువగా వాడతారు.. అవి కూడా వంటలేనా అంటూ నోటికొచ్చిన మాటలు మాట్లాడాడు. ఈ కామెంట్స్ చేసిన ప్రొఫెసర్‌పై భారతీయ నెటిజన్లు మండిపడ్డారు. నువ్వు మనిషివా, దున్నపోతువా అంటూ తిట్ట దండకాన్ని ఎత్తుకున్నారు.

నూనె ఎక్కువ వాడతాం, కారం ఎక్కువగా తింటాం నీకెందుకు అంటూ మండిపడ్డారు. వీరికి మద్ధతుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ రుచులను ఇష్టపడే మరికొందరు ఆహార ప్రియులు జతకలవడంతో ప్రొఫెసర్‌కు దిమ్మ తిరిగిపోయింది.

నోరు అదుపులో పెట్టుకో అంటూ కొంతమంది విదేశీయులు సైతం చీవాట్లు పెట్టారు. నీ అభిప్రాయం గురించి చెప్పుకో తప్పులేదు.. అంతే కానీ మేమంతా అంటూ మమ్మల్ని కూడా కలుపుతున్నావ్ నీ ఇష్టమేనా అంటూ వారు టామ్‌పై విరుచుకుపడ్డారు.