అమెరికాలో దీపావళలి వేడుకలు జరుపుకోవడం తమ దేశంలోని మత స్వేచ్ఛకు నిదర్శనమని అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఇంతటి ప్రాశస్త్రం ఉన్న వెలుగుల పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బుద్ధిస్తులకు తనతోపాటు భార్య మెలానియా ట్రంప్ తరపున కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.

కాగా... ఓవల్ కార్యాలయంలో కొంతమంది ఇండో అమెరికన్ల సమక్షంలో ట్రంప్ దీపావళి వేడుకలు నిర్వహించారు. అనంతరం ట్రంప్ మాట్లాడారు. అమెరికాలో నివసించే ప్రజలు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా పండగులు జరుపుకునే అవకాశం తమ దేశ రాజ్యంగం కల్పించిందన్నారు. ఈ మేరకు ప్రతీ మతస్తుడి హక్కులను కాపాడుతూ.. తమ మత ఆచారాలను మరింత గొప్పగా పాటించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

అనంతరం దీపావళి పండగ గురించి మాట్లాడుతూ... ఈ దీపావళి పండగ రోజు అన్ని మత సంప్రదాయాలు పాటించే వారు తొలుత పూజ చేస్తారని చెప్పారు.  ఆ తర్వాత దీపాలు వెలిగించి కాంతులు వెదజల్లుతారన్నారు. సంప్రదాయ వంటకాలతో భోజనం చేసి బంధువులు, స్నేహితులతో పండగను గొప్పగా జరుపుకుంటారని చెప్పారు.

అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దీపావళిని జరుపుకునే వారందరికీ ఈ సందర్భంగా ట్రంప్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని శ్వేత సౌధంలో దీపావళి వేడుకులు నిర్వహిస్తూ వస్తున్నారు. 

"