Asianet News TeluguAsianet News Telugu

Independence Day 2022: స్వతంత్య్ర పోరాటంలో ఈ 8 మంది వీరుల త్యాగాలు ఎన్నటికీ చిరస్మరణీయమే..

Independence Day 2022: ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాల ఫలితంగానే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.  1947లో బ్రిటిష్ వలసవాదుల నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించేందుకు  పోరాడిన వారిలో ఎనిమిది మంది వీరుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

 Independence Day 2022:  8 heroes of our struggle for freedom
Author
Hyderabad, First Published Aug 9, 2022, 11:56 AM IST

మహాత్మా గాంధీ

అహింసాయుత పోరాటానికి శాశ్వత చిహ్నంగా నిలిచిన మహాత్మాగాంధీ క్విట్ ఇండియా, శాసనోల్లంఘన వంటి ఉద్యమాలకు నాయకత్వం వహించారు.  గాంధీ ప్రపంచ వ్యాప్తంగా పౌర హక్కులు,  విముక్తి ఉద్యమాలకు ప్రేరణ కలిగించాడు. గాంధీ భావాలకు ప్రభావితమైన వారిలో దక్షిణాఫ్రికా వర్ణవివక్ష వ్యతిరేక ఐకాన్ నెల్సన్ మండేలా కూడా ఉన్నారు.

తాంతియా తోపే

1857 నాటి భారత తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు లేదా మొదటి స్వాతంత్ర్య సంగ్రామం అని కూడా పిలుస్తారు.  1857 నాటి భారత తిరుగుబాటులో పాల్గొన్న ప్రముఖ నాయకులలో తాంతియా తోపే ఒకరు. ఈ తిరుగుబాటు విజయవంతం కానప్పటికీ.. ఈ సంఘటన స్వాతంత్య్ర పోరాటంలోని.. చరిత్రలో ఎన్నటికీ ప్రత్యేకంగానే నిలుస్తుంది. 

రాణి లక్ష్మీబాయి

ధైర్యసాహసాలకు పర్యాయపదంగా ఉన్న ఝాన్సీ రాణి కూడా తిరుగుబాటుకు ప్రధాన పాత్రధారి. బ్రిటీష్ పాలనకు ఈమె కూడా ఎంతో పోరాడి చరిత్రలోకెక్కింది.

లాలా లజపతి రాయ్

1928 అక్టోబర్ లో లాహోర్ లో సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు నాయకత్వం వహించినందుకు రాయ్ ను స్మరించుకుంటారు. నిరసనలో పోలీసుల దాడి తర్వాత లాలా లజపతి రాయ్ ప్రసిద్ధి చెందాడు. "ఈ రోజు నాపై పడిన దెబ్బలు భారతదేశంలో బ్రిటిష్ పాలన శవపేటికలో చివరి మేకులు" ఈయన అన్నారు. 

వల్లభ్ భాయ్ పటేల్

వృత్తిరీత్యా బారిస్టర్ అయిన వల్లభ్ భాయ్ పటేల్.. బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా గుజరాత్ లో జరిగిన అహింసాయుత శాసనోల్లంఘన ఉద్యమంలో ప్రముఖ వ్యక్తులలో ఒకరు.

భగత్ సింగ్

ఫైర్ బ్రాండ్ విప్లవకారుడైన భగత్ సింగ్ తన 23వ యేటే ఉరివేసుకుని చనిపోయాడు. ఇతను బ్రిటిష్ అధికారులపై దాడులలో భాగంగా ఉన్నాడు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వ్యక్తులల్లో ఈయన పోరాటం ఎన్నిటికీ చిరస్మరణీయమే.

సుభాష్ చంద్రబోస్

నేతాజీ గా ప్రసిద్ధి చెందిన సుభాష్ చంద్రబోస్ 1943లో భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడేందుకు మొట్టమొదటి ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు.

అష్ఫాకుల్లా ఖాన్

అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ తో కలిసి హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ను.. సాయుధ తిరుగుబాటు ద్వారా స్వాతంత్ర్యం సాధించే ప్రయత్నంలో స్థాపించారు. 1925 లో కాకోరి రైలు దోపిడీకి గానూ వీరిద్దరికీ మరణశిక్ష విధించబడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios