హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లో గల శ్రీనివాసపురంలో ఓ మహిళ తన ఏడాది వయస్సు గల కూతురితో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

మృతురాలిని మేరీ మార్టిన్ గా గుర్తించారు. భర్తతో గొడవ పడి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. భవనం నాలుగో అంతస్థు నుంచి ఆమె కిందికి దూకింది. మహిళతో పాటు ఆమె కూతురు కూడా ఈ ఘటనలో మరణించింది. మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.