హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని  ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఫలితాలు ఇవాళ(గురువారం)వెలువడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగానే తెలంగాణలో కూడా ఇంటర్ ఫస్ట్, సెంకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. 

ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ఇదివరకే వివిధ రకాల ప్రచారం జరగడంతో విద్యాశాఖ ప్రకటన చేసింది. గురువారం ఫలితాల విడుదల ఖాయమని కన్ఫర్మ్ చేసింది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు.

ఫలితాల కోసం కింది వెబ్ సైట్ లింకులను ఓపెన్ చేయండి 

http://Tsbie.cgg.gov.in

http://Manabadi.com

http://Examresults.ts.nic.in

http://Results.ccg.gov.in