టిక్ టాక్ ఇండియా -  తెలంగాణ ప్రభుత్వం, ఐటీశాఖ, డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో హోటల్ హరిత ప్లాజాలో సోమవారం టిక్ టాక్‌పై ప్రభుత్వంలోని పౌర సంబంధాల అధికారులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా టిక్ టాక్ సమర్థ వినియోగం, పాలసీ విధానాలు, సురక్షా పద్ధతుల మీద టిక్ టాక్ ఇండియా పాలసీ డైరెక్టర్ నితిన్ సాలూజా, యువరాజ్ వర్క్ షాప్ లో పాల్గొన్నవారికి దిశా నిర్దేశం చేశారు.

గత మూడునెలలుగా టిక్ టాక్ ఇండియా,  కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. సామాజిక భాద్యతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను తమ వంతు భాద్యతగా టిక్ టాక్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.

ఇండియాలో ముఖ్యంగా గ్రామీణ సమాజంలో టిక్ టాక్ వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేసేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని నితిన్ వెల్లడించారు.

ఇటీవలి కాలంల్ అత్యంత ప్రజాదరణ పొందుతున్న టిక్ టిక్ విషయంలో కూడా ప్రభుత్వ సిబ్బందికి అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పేర్కొన్నారు.  ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు టిక్ టాక్ వినియోగం మీద అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం పీఆర్వో రమేష్ హజారి, రాచకొండ కమీషనర్ పీఆర్వో దయాకర్, సైబరాబాద్ కమీషనర్ పీఆర్వో కిరణ్ కుమార్, డిజిపి సీపీఆర్వో హర్ష భార్గవి, టూరిజం, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ మొదలైన డిపార్ట్ మెంట్ లకు చెందిన పలువురు ప్రజా సంబంధాల అధికారులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు