జూబ్లీహిల్స్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు పబ్బుల యజమానులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్న సమాచారంతో పలు పబ్‌లపై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పబ్ లో డ్యాన్స్, మ్యూజిక్ ఫ్లోర్లను తెరుస్తున్నారన్న సమాచారంతో జూబ్లీహిల్స్ లోని పబ్బులపై దాడులు చేశారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అర్థరాత్రి వరకు నిర్వహిస్తున్న పబ్బులపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తబులా రస, ఏయిర్‌ లైవ్‌, కెమెస్ట్రీ, అమ్నీసియా పబ్‌లపై దాడులు చేసి వాటిపై కేసులు నమోదు చేశారు. 

ఇవన్నీ అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్‌ను తేవడం, కోవిడ్‌ నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేయడం, మాస్కులు లేకుండా పబ్బుకు అనుమంతిచడం చేస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పిన పబ్బు యజమానులు.. కాసుల కోసం కక్కుర్తి పడి కరోనా విస్తరణకు కారకులుగా మారుతున్నారని పోలీసులు తెలిపారు.