హైదరాబాద్: రక్షక భటుడే భక్షక భటుడయ్యాడు. కాపాడాల్సిన కానిస్టేబుల్ ఓ బాలికను కాటేశాడు. ఓ బాలికపై క్రైమ్ కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. ఉమేష్ అనే క్రైమ్ కానిస్టేబుల్ ఈ దురాగతానికి ఒడిగట్టాడు. 

లాక్ డౌన్ కారణంగా బాలిక ఇంట్లో ఉంటూ వచ్చింది. ఆమె నివాసం ఉంటున్న ఇంటి పక్కనే క్రైమ్ కానిస్టేబుల్ ఉమేష్ నివాసం ఉంటున్నాడు. అతను రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ లో క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. బాలికపై ఉమేష్ అత్యాచారం చేశాడు. 

ఆ సంఘటన సికింద్రాబాదులోని బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.