హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. చాక్లెట్ దొంగిలించాడని డీ మార్ట్ సిబ్బంది ఇంటర్మీడియట్ విద్యార్థిపై దాడి చేశారు. మృతుడిని సతీష్ గా గుర్తించారు.

ఆ తర్వాత సతీష్ మరణించాడు. దీంతో డీమార్ట్ సిబ్బంది తీవ్రంగా కొట్టడం వల్లనే తమ కుమారుడు మరణించాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపించారు. సతీష్ హయత్ నగర్ లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వివరాలు అందాల్సి ఉంది.