హైదరాబాద్: హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్పోసిస్ లో టీం లీడర్ గా పనిచేస్తున్న రఘురామ్(35)గా అతన్ని గుర్తించారు. అతను విజయవాడకు చెందినవాడని తెలుస్తోంది.. 

తన కార్యాలయం సమీపంలో న్న మంత్రి అపార్టుమెంట్ పై నుంచి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శ్రీదేవి (32), కూతురు ప్రజ్ఢ (6)లతో కలిసి అతను చందానగర్ లో నివాసం ఉంటున్నాడు. 

భార్య శ్రీదేవి కూడా ఇన్ఫోసిస్ కంపెనీలోనే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. అనారోగ్యం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

రెండు రోజుల క్రితం ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగం చేయడం ఇష్టం లేక, ఆ విషయం ఇంట్లో చెప్పలేక అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ సంఘటన హైదరాబాదులోని కెపీహెచ్ బీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 

విశాఖపట్నం జిల్లా దువ్వాడకు చెందిన గుండ్ల వెంకట నాగచైతన్య (23) జూబ్లీహిల్స్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, గురువారం ఉదయం ఇంట్లో అతను విగతజీవుడై కనిపించాడు. పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.