హైదరాబాద్: సెలూన్, స్పా సెంటర్ పేరిట అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరక ఓ సెలూన్ పై వెస్ట్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఇందులో నిర్వహకుడితో పాటు ఇద్దరు యువతులు పోలీసులుకు పట్టుబడ్డారు.

హైదరాబాద్ లోని ఎస్సార్‌నగర్‌‌లోని స్టార్‌ ఫ్యామిలీ సెలూన్‌ పేరిట మసాజ్‌, స్పాసెంటర్‌ కొనసాగుతోంది. అయితే ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందన్న సమాచారం మేరకు టాస్క్ పోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టుబడ్డ నిర్వహకుడితో పాటు ఇద్దరు యువతులను ఎస్సార్ నగర్ పోలీసులకు అప్పగించారు టాస్క్ పోర్స్ పోలీసులు.