ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి?
National Epilepsy Day 2023: ఫిట్స్ అనేది మెదడు కణాలలో అసాధారణ విద్యుత్ చర్య వల్ల వచ్చే పరిస్థితి. దీనివల్ల మూర్చ వస్తుంది. మూర్చ ఉన్న వ్యక్తిని ఎలా చూసుకోవాలో చాలా మందికి తెలియదు. దీనివల్లే వారి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. నేషనల్ ఎపిలేప్సీ డే సందర్భంగా మూర్చ వచ్చినప్పుడు వారిని ఎలా చూసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
National Epilepsy Day 2023: భారతదేశంలో ప్రతి ఏడాది నవంబర్ 17 న నేషనల్ ఎపిలెప్సీ డే ను జరుపుకుంటారు. మూర్ఛ ఒక ప్రాణాంతక వ్యాధి. దీనికి చికిత్స లేదు. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఈ మూర్చ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మూర్ఛ మెదడు వ్యాధి. ఈ వ్యాధిలో దీనిలో మెదడు సంకేతాలు దెబ్బతింటాయి. దీనివల్లే మూర్చ బారిన పడతారు.
మెదడు సంకేతాలలో అవాంతరాల కారణంగా రోగికి స్పృహ ఉండదు. ప్రవర్తన మారుతుంది. అలాగే శరీరం, భావోద్వేగాలు మొదలైన వాటిపై నియంత్రణ వీరికి ఉండదు. ఈ వ్యాధి కారణంగా రోగి జీవితం మొత్తం ప్రభావితం అవుతుంది. అయితే మూర్ఛ వంటి ప్రమాదకరమైన వ్యాధి గురించి జనాలకు చాలా తక్కువగా తెలుసు. అందుకే మూర్చ దినోత్సవం సందర్భంగా జనాలకు దీనిపై అవగాహన కల్పిస్తుంటారు. ఈ రోజు సందర్భంగా మనం మూర్చ వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మూర్ఛ లక్షణాలు
- మూర్ఛ
- కండరాలపై నియంత్రణ లేకపోవడం
- మాట్లాడటంలో ఇబ్బందికలగడం
- చుట్టూ ఏం జరుగుతున్నా అర్థం కాకపోవడం
- హృదయ స్పందన రేటు పెరగడం
- శ్వాస ఆడకపోవడం
- భయంగా లేదా ఆత్రుతగా అనిపించడం
- ఒకే చోట చూస్తూ ఉండిపోవడం
- వినికిడి లోపం
- చూడటంలో ఇబ్బంది
- రుచి, వాసన లేదా అనుభూతిలో మార్పులు
ఎవరికైనా మూర్ఛ ఉంటే ఏం చేయాలి?
- మూర్ఛ వచ్చిన వ్యక్తిని సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నించాలి.
- వారు శ్వాస బాగా తీసుకోవడానికి సహాయపడాలి.
- మూర్ఛ ఆగిపోయిన తర్వాత వారిని సురక్షితమైన ప్రదేశంలో పడుకోబెట్టాలి.
- ముఖ్యంగా మెడ దగ్గర బిగుతుగా ఉండే దుస్తులను వేసుకుంటే వాటిని వదులు చేయాలి. దీంతో వారికి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
- మూర్చ బారిన పడిన వారి తలకు గాయం కాకుండా చూసుకోవాలి. తలకు గాయలు కాకుండా ఉండేందుకు వారి చుట్టూ ఉన్న ప్రమాదాలను రాళ్లు, కట్టెలు వంటి ప్రమాదాలను తొలగించాలి.
- మూర్ఛ పూర్తిగా ఆగిపోయే వరకు, మూర్ఛ నుంచి పూర్తిగా కోలుకునే వరకు వాళ్ల నోట్లో ఏమీ ఉంచకూడదు.
- మూర్ఛ ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉన్నా లేదా కొద్దిసేపటి తర్వాత రెండవ మూర్ఛ వచ్చినప్పుడు వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి.
- మూర్చ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకునేలా చూడాలి. వారితో కనీసం ఒక్కరైనా ఉండాలి. వారు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.