నిరుద్యోగులకు తీపి కబురు...3,689 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి నియోజకవర్గానికి ఒక బిసి గురుకులాలను ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీతో కేవలం బిసి వర్గాన్నే కాదు నిరుద్యోగ యువతను కూడా ముఖ్యమంత్రి ఆకర్షించారు. అయితే ఆ హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి సిద్దమయ్యారు. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే 119 బీసి గురుకులాల్లో భారీ ఉద్యోగాల భర్తీకి తాజాగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

మొత్తం 3,689 పోస్టులు భర్తీకి ప్రభుతవం నుండి అనుమతి లభించింది. 1071 టీజీటీ, 833 పీజీటీ, 833 జేఎల్, 119 ప్రిన్సిపల్ పోస్టులు, 119 ఫిజికల్ డైరెక్టర్, 119 పీఈటీ పోస్టులకు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా 119 లైబ్రేరియన్, 119 క్రాఫ్ట్, 119 స్టాఫ్ నర్స్, 119 సీనియర్ అసిస్టెంట్, 119 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు 595 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా ప్రభుత్వ అనుమతి లభించింది.
ఇలా భోదన, భోదనేతర సిబ్బందిని నియామకం చేపట్టి 2019 నుండి గురుకులాలను ప్రారంభించనున్నారు. 2019- 2020 విద్యా సంవత్సరానికి ఈ భారీ ఉద్యోగాల భర్తీ
చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.