Asianet News TeluguAsianet News Telugu

హాలీవుడ్ హీరోల స్ట్రాటజీ ఫాలో అవుతున్న ప్రభాస్..అందుకే హను రాఘవపూడి తో

 గతేడాది సీతారామంతో తిరుగులేని హిట్టు కొట్టిన హను రాఘవపూడితో ప్రభాస్‌ సినిమా చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారట. 

why Prabhas allots dates for Hanu Ragahvapudi film jsp
Author
First Published Jul 23, 2023, 3:50 PM IST


హను రాఘవవూడి ఖచ్చితంగా తెలుగులో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో ఒకరనే విషయం తెలిసిందే. ఆయన వరస ఫెయిల్యూర్స్ ఉన్నా సినిమాలు వస్తూనే ఉండటానికి కారణం ఆయన సినిమాల్లో కనిపించే విజువల్ బ్యూటీనే. అయితే సీతారామం తో ఆయన సక్సెస్ బాట పట్టారు. ఈ నేపధ్యంలో ఆయన ప్రభాస్ తో సినిమా చేయాలని ఎప్రోచ్ అవటం ..ఆయన ఓకే చెప్పటం జరిగింది. అయితే ప్రాజెక్టు ఎప్పుడనేది క్లారిటీ లేదు. కానీ ప్రాజెక్ట్ కే దర్శకుడు నాగ్ అశ్విన్ ..ఈ విషయంలో ప్రభాస్ తో మాట్లాడి సెట్ చేసారని సమాచారం. సీతారామం సినిమా నాగ్ అశ్విన్ తోర్పాడుతోనే జరిగింది. ఇక వెంటనే ప్రభాస్...ఈ దర్శకుడుకి డేట్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అందుకు ఓ లాజిక్ , స్ట్రాటజీ ఉందని సమాచారం. 

 ‘ఆదిపురుష్’, ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌-k’ ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ భారీ బడ్జెట్‌ సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయాడు ప్రభాస్‌. అంత బిజీ షెడ్యూల్స్‌లోనూ కథలు వింటూ కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది సీతారామంతో తిరుగులేని హిట్టు కొట్టిన హను రాఘవపూడితో ప్రభాస్‌ సినిమా చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారట. అధికారిక ప్రకటన రాకపోయినా.. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని, డిసెంబర్ లో అఫీషియల్‌ ప్రకటన ఉంటుందని సమాచారం. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన హను రాఘవపూడి.. ప్రభాస్‌ కోసం రూటు మార్చాడని తెలుస్తుంది. ఆ రూట్ ఏంటనేది ప్రక్కన పెడితే...ప్రభాస్ మాత్రం తను చేసే యాక్షన్ సినిమాలకు భిన్నమైన కథాంశాలు ఇమ్మీడియట్ సినిమాలుగా ఉండాలని కోరుకుంటున్నారుట.

అందులో భాగంగానే మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ చిత్రం , ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ కమిటయ్యాడంటున్నారు.  సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో తనుకు పెరిగే యాక్షన్ ఇమేజ్ ని కంట్రోలు చేయటం కోసమే ఇలాంటి యాక్షన్ కు అవకాసం లేని సాప్ట్  ప్రాజెక్టు సెట్ చేస్తున్నారని అంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ హీరోలు తాము ఓ యాక్షన్ సినిమా చేసాక వెంటనే ఓ కామెడీ సినిమాతో ఇమేజ్ ని కంట్రోలు చేస్తారు. అదే స్ట్రాటజీ ఇక్కడ ప్రభాస్ ప్లే చేస్తున్నాడంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios