రిలేషన్స్ దెబ్బతింటాయనే దిల్ రాజు ఆపేసాడా,మళ్లీ ఏం జరిగింది?

 అల్లు అరవింద్ వంటి నిర్మాతతో అనవసరమైన వివాదం ఎందుకుని ఆ ప్రాజెక్టుని తాత్కాలికంగా ఆపేసారని తెలుస్తోంది.  

Why Parsuram ,Vijay Devarakonda movie is on hold?


గీత గోవిందం కాంబో మ‌రోసారి కుదిరింది అని అభిమానులు మురిసిపోయారు.  హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారని, ఈ స‌క్సెస్ పుల్ కాంబో మూవీని అనౌన్స్ చేశారు. అయితే ఆనందపడినంత  సేపు పట్టలేదు.  తన క్యాంప్ నుంచి వచ్చి సూపర్ హిట్ కాంబోతో హిట్ కొట్టిన పరుశురామ్‌ చేసిన ఇలా వేరే క్యాంప్ కు వెళ్లి అదే మ్యాజిక్ రిపీట్ చేయటానికి ప్రయత్నించటం అల్లు అరవింద్ కు నచ్చలేదని,  అగ్గి మీద గుగ్గిలం అయ్యారని వార్తలు వచ్చాయి.  విజయ్ తో గీత ఆర్ట్స్ లో చేయాల్సిన సినిమాను దిల్ రాజు తో ఎలా చేస్తాడు అంటూ మాతో చేయాల్సిన సినిమా సంగతి ఏమిటని అక్కడికక్కడే నిలదీశారు అల్లు అరవింద్ అని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో అల్లు అరవింద్ దగ్గర పరశురామ్ అడ్వాన్స్ తీసుకున్నాడని టాక్ కూడా నడిచింది. ఇక ఈ కారణంగానే అల్లు అరవింద్ కి బాగా కోపం వచ్చిందని మీడియాలో ప్రచారం జరిగింది. 

ఈ క్రమంలో  ఈ మెగా ప్రొడ్యూసర్  కి  పర‌శురామ్‌ నేరుగా అల్లు అరవింద్ ను కలిసి క్షమాపనలు చెప్పాడని కూడా  అన్నారు. అయినా అల్లు అరవింద్ శాంత పడలేదని సమాచారం అందుతుంది. ఏదైమైనా  పరుశురామ్‌, దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ తో సినిమా అనౌన్స్ చేయడం ఎంత పెద్ద వివాదానికి దారి తీసింది. దాంతో దిల్ రాజు సైతం ఇప్పుడు అల్లు అరవింద్ వంటి నిర్మాతతో అనవసరమైన వివాదం ఎందుకుని ఆ ప్రాజెక్టుని తాత్కాలికంగా ఆపేసారని తెలుస్తోంది. ఎందుకంటే మెగా క్యాంప్ నుంచి చాలా హీరోలు ఉన్నారు.

 అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తోనూ దిల్ రాజు కు మంచి అనుబంధం ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి అల్లు అర్జున్ తో సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఒక్క ప్రాజెక్టు కోసం ఆశపడితే మొత్తం క్యాంప్ తో విరోధమవుతుందని భావించి వద్దనుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు రీసెంట్ గా పరుశురామ్, విజయ్ దేవరకొండలు ఇద్దరికీ దిల్ రాజు కాల్ చేసి ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుని పెండింగ్ లో పెడదామని, తర్వాత ఆలోచించి చేద్దామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఏదైమైనా దిల్‌రాజు బ్యాన‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ఫ్రెష్ స్క్రిప్ట్‌తో రూపొంద‌నున్న భారీ బ‌డ్జెట్ సినిమా ఇలా ఆగిపోవటం అభిమానులకు బాధాకరమే.  ఇక మ‌హేష్‌బాబు స‌ర్కారువారి పాట‌తో గ‌త ఏడాది ప‌ర‌శురామ్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో నాగేశ్వ‌ర‌రావు పేరుతో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కానీ స్క్రిప్ట్ విష‌యంలో నాగ‌చైత‌న్య‌, ప‌ర‌శురామ్ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ వ‌ర్క‌వుట్ కాలేదు.ఇప్పుడీ ఈ రెండు ప్రాజెక్టులు ప్రక్కన పెట్టి కార్తీతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios